TS Crime Rate 2022: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఈ ఏడాదికి సంబంధించిన క్రైమ్ రివ్యూను వెల్లడించారు. 2022 సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల 60 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 2022 సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని, కానీ ఇంత ప్రశాంతంగా ముగుస్తుందని అనుకోలేదని అన్నారు. కరోనా  కారణంగా జనాలు కూడా ఎక్కువగా బయటికి రాలేదని, కరోనా తర్వాతే ప్రజలంతా ప్తరీ ఫంక్షన్ కు ఎక్కువ సంఖ్యలో వచ్చారని పేర్కొన్నారు. బోనాలు పండుగ, శ్రీ రామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్, మిల్ద్ ఉన్ నబి ఇలాంటి తదితర పండుగలకు ఎక్కువ సంఖ్యలో జనాలు హాజరయ్యారని వివరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా హైదరాబాద్ లోనే జరిగిందని, అలాగే వజ్రోత్సవాలు కూడా ఇక్కడ జరిగాయని చెప్పుకొచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అన్ని వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.


ఈ ఏడాది మెత్తం 273 మంది డ్రగ్స్ కేసులు నమోదు


కాకపోతే రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కు సంబంధించిన నేరాలు పెరిగాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. వాహనాల దొంగతనాలు కూడా ఈ సంవత్సరం పెరిగాయని, ఈ ఏడాది  మొత్తం 273 డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. మొత్తం 1082 మంది నిందితులను అరెస్టు చేస్తే.. అందులో 13 మంది విదేశీయులు ఉన్నారని వివరించారు. ఈ సంవత్సరం 2 వేల 249 మంది సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవ్వగా.. 226 డిటెక్ట్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది మహిళలపై నేరాలు 2524 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 296 రేప్ కేసులు కాగా, 126 కిడ్నాప్ కేసులు, 1418 మహిళలపై వేధింపుల కేసులున్నాయన్నారు. ఈ ఏడాది కొత్తగా 91 మందిపై రోజు షీట్ పెట్టామన్నారు. ఆస్తుల దొంగతనం కేసుల్లో 25 కోట్ల ప్రొపర్టీ చోరీ అవగా... 62% రికవరీ చేసినట్లు వివరించారు. ఈ ఏడాది భారీగా ఆర్థిక నేరాల కేసులు నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఇందులో 949 కేసులు నమోదు.. 15 వందల కోట్లకు పైగా డబ్బు కొల్లగొట్టిన నేరగాళ్లు ఉన్నారని పేర్కొన్నారు. 


రోడ్డు ప్రమాదాల ద్వారా 110 మంది పాదచారులు మృతి


వివిధ కేసుల్లో 21 మందికి జీవిత కాలం శిక్ష పడేలా చేశామని సీవీ ఆనంద్ తెలిపారు. ఈఏడాది 63 మర్డర్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది భారీగా చీటింగ్ కేసులు పెరిగాయన్నారు. వాటి సంఖ్య 4297 గా చెప్పారు. అలాగే 273 డ్రగ్ కేసులు నమోదు కాగా 456 గేమింగ్ కేసులు అని 70 శాతం కన్విక్షన్ రేటు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 113 అట్రాసిటీ కేసులు నమోదు కాగా డ్రగ్స్ కేసుల్లో 1082 మందిని నిందితులుగా చేర్చినట్లు పోలీసులు వివరించారు. ఈ ఏడాది 42, 634 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో 237 మందిని జైలుకి పంపినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ ఏడు 2017 ఆక్సిడెంట్ కేసులు నమోదు అయ్యాయని 301 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోగా, 2034 మందికి గాయాలు అయినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల ద్వారా 110 మంది పాదచారులు చనిపోయారని, గ్రీన్ ఛానల్ ద్వారా 36 సార్లు లైవ్ ఆర్గాన్స్ ట్రాన్స్పోర్ట్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.