Ganesh Immersion in Hyderabad: గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు అన్నింటినీ మూసేయాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వినాయక నిమజ్జనం జరిగే మంగళ, బుధవారాల్లో అన్ని మద్యం షాపులు మూసి వేయాలని హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గణేశ్‌ నిమజ్జన వేడుకల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 


మంగళవారం (సెప్టెంబరు 17) ఉదయం 6 గంటల నుంచి బుధవారం (సెప్టెంబరు 18) సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పరిధిలో మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. స్టార్ హోటల్ బార్స్‌, రిజిస్టర్ క్లబ్స్‌కు మాత్రం ఈ ఆదేశాలు వర్తించబోవని పోలీసులు తెలిపారు.