నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. నిన్మ,మొన్న దాకా నోర్లు కట్టేసుకునేలా చుక్కలు చూపించిన చికెన్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రెండు మూడు నెలల నుంచి చికెట్లు అమాంతం ఆకాశాన్ని అంటాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉండేది. పెరిగిన రేట్లకు భయపడి వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో చికెన్ రేట్లు భారీగా తగ్గాయి. అయితే వర్షాల నేపథ్యంలో చికెన్ రేట్లు పడిపోయాయి. వాతావరణంలో మార్పులతో హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. టమాటా ధరలు పెరుగుదలతో ఆందోళన చెందుతున్న ప్రజలకు చికెన్ ధరలు తగ్గడం ఉపశమనం కలిస్తోంది. కిలో రూ. 125కు చికెన్ రేటు పడిపోయింది.
కేజీ రూ.125కే
ఫారాలల్లో కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండడం, వేసవి కాలం ముగియడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. వచ్చే నెల నుంచి పెళ్లిళ్లు, ఫంక్షలు ఉండడంతో వ్యాపారాలు పడిపోయాయని, ఫలితంగా ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గత నెల వరకు కిలో లైవ్ చికెన్ రూ. 160 నుంచి రూ. 170 ఉండేది. కిలో మాంసం రూ. 280 నుంచి రూ. 320 వరకు పలికింది. అయితే ఇప్పుడు కిలో లైవ్ రూ. 125, మాంసం రూ. రిటైల్ షాపుల్లో కిలో రూ.200 ఉంటోంది. బల్క్‌గా తీసుకునే వారికి ధరలు మరింత తగ్గనున్నాయి.
శ్రావణ మాసం ప్రారంభమైతే చికెన్ ధరలు మరింత తగ్గనున్నాయి. శ్రావణ మాసంలో చాలా మంది మాంసాహారం ముట్టకపోటంతో చికెన్‌కు డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. దీంతో ధరలు అమాంతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం కూరగాయులు ధరలు ఆకాశన్నంటిన తరుణంలో చికెన్ ధరలు తగ్గటం ఊరటనిచ్చే అంశమే. ప్రస్తుతం కిలో టమాటా రూ. 100 నుంచి 150 పైగా పలుకుతోంది. కేజీ కేజీ టమాట ధరకు కేజీ చికెన్ వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మరింత తగ్గే అవకాశం
రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు తెలిపారు. కిలో రూ. 90 కంటే తక్కువకే విక్రయించే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కవ. కేజీ టమాటా కొనలేని వారు ఇప్పుడు కేజీ చికెన్ కొని హ్యాపీగా లాగించేయొచ్చు. హైదరాబాద్‌కు కోళ్లు ప్రధానంగా శంషాబాద్, షాద్‌నగర్, కందుకూరు, కొత్తూరు, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, రంగారెడ్డి, హయత్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి కోళ్ల సరఫరా జరుగుతుంది.