HAL Jobs Notification : హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో సెకండరీ స్కూల్ లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) ప్రైమరీ స్కూల్ టీచర్ నుంచి ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ వరకు ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వయసు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్(Offline) పద్ధతిలో ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ సమాచారం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంబంధించిన వెబ్‌సైట్ https://halsecondaryschoolhyderabad.in/ ను క్లిక్ చేయండి. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 22, 2022 వరకు అవకాశం ఉంది. మొత్తం 13 పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం 13 ఖాళీలు
పోస్టుల వారీగా సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/డిగ్రీ, గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల అర్హత పరీక్షలో పాస్ అవ్వాలి. సంబంధిత ఫీల్డ్ లో అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండాలి. పోస్టులను బట్టి 35 నుంచి 45 ఏళ్ల వయస్సు గల వారు అర్హులు.
- ప్రైమరీ స్కూల్ టీచర్ - 04 ఖాళీలు - గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ చేయాలి. బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సీటెట్, టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెలకురూ. 20,000 జీతం ఇస్తారు.
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 01 ఖాళీలు - సైన్స్ విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 55 శాతం మార్కులతో బాటనీ, జూయాలజీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి. బీఈడీ చేసి ఉండాలి. సీటెట్, టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. జీతం రూ. 22,000.
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 01- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 55 శాతం మార్కులతో బీఏ, బీకాం, గ్రాడ్యుయేషన్, బీఈడీ చేయాలి. సీటెట్, రాష్ట్ర టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జీతం రూ. 22,000.
- డాన్స్ టీచర్-01 ఖాళీలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డాన్స్‌లో డిగ్రీ కలిగి ఉండాలి. జీతం రూ. 19,000
- మ్యూజిక్ టీచర్-01 ఖాళీలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సంగీతంలో డిగ్రీ చేయాలి. జీతం రూ. 19,000
- కౌన్సెలర్ - 01 పోస్టులు- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సైకాలజీలో డిగ్రీ చేసి ఉండాలి. జీతం రూ. 19,000
- అడ్మినిస్ట్రేటీవ్ సపోర్టీవ్ క్లర్క్ -01 పోస్టులు - కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. జీతం రూ. 19,000
- నర్సరీ టీచర్ - 01 పోస్టులు - ఎన్‌టీటీ, మాంటిస్సోరిలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. జీతం రూ. 19,000
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్( ఫీమెల్) – 01 - గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. జీతం రూ. 20,000
- ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ - 01 పోస్టులు - గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బీసీఏ లేదా సంబంధిత కోర్సుల్లో అర్హత సాధించాలి. జీతం రూ. 19,000
సెలెక్షన్ ఈ విధంగా
ముందుగా అభ్యర్థుల నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మెరిట్ సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఇలా
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://halsecondaryschoolhyderabad.in క్లిక్ చేయాలి
- నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి
- నోటిఫికేషన్ చివరిలో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అది డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- తప్పులు లేకుండా దరఖాస్తు ఫామ్ నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి The Principal, HAL Secondary School, HAL Township, Balanagar, Hyderabad-500042 ఈ అడ్రస్‌కు పంపాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 22, 2022