Double Bedroom Houses In Hyderabad |

  చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పడంతో దరఖాస్తు చేసుకున్న వారు ఆందోళనకు దిగారు.హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ వాసులు వణికిసోతున్నారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇదివరకే ఒక్కోచోట చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయడంతో కొందరిలో భయాందోళన నెలకొంది. తమ ఇండ్లను సైతం కూల్చేస్తారని కూకట్ పల్లిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.


మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు


కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు అక్రమ నిర్మాణాలకు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలకు నోటీసులు ఇస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇండ్ల సంఖ్యను గుర్తించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. దాంతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల వేరే చోటుకు తరలించారు. ఇందుకోసం ప్రభుత్వం వారిలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అసలే అసలు సమస్య మొదలైంది. ఓవైపు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే, అధికారులు తరలించనున్న మూసీ పరివాహక ప్రాంతాల్లో కుటుంబాలు అధికంగా ఉండనున్నాయి. 


రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొత్త చిక్కులు తప్పవా?


మరోవైపు గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ పంపిణీ జరగలేదు. కానీ గతంలో దరఖాస్తు చేసుకున్న తమకు కాకుండా, ఇప్పుడు మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని రేవంత్ సర్కార్ చెప్పడం ఉద్రికత్తలకు దారితీసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న తమకు కాకుండా, మూసీ బాధితులకు ఇండ్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రయత్నంలో భాగంగా  చంచల్‌గూడ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 



Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది, సుద్దపూస మాటలాపి అది కూలగొట్టు: హరీష్ రావు