KCR and Harish Rao: పీసీ ఘోష్‌ కమిషన్  రిపోర్టు విషయంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఈ కమిటీపై స్టే విధించి రద్దు చేయాలనే విషయంపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.  కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయనే విషయం నిగ్గుతేల్చేందుకు పీసీ ఘోష్‌ కమిటీని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అందర్నీ విచారించిన కమిటీ ప్రాజెక్టులో లోపాలపై ప్రభుత్వానికి నివేదించింది. 

రాజకీయ కక్ష సాధింపుతో చేస్తున్న చర్యలను అడ్డుకోవాలని కేసీఆర్, హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. కమిటీ రిపోర్టు రద్దు చేయాలని రిక్వస్ట్ పెట్టారు. దీనిపై వాదనలు విపించిన ఏజీ... కాళేశ్వరం కమిషన్ నివేదిక ను అసెంబ్లీ లో ప్రవేశ పెడుతామన్నారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాకే చర్యలు తీసుకుంటామన్నారు అడ్వకేట్ జనరల్. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

పీసీ ఘోష్‌ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. పిటిషనర్స్ ఇద్దరు ప్రస్తుత ఎమ్మెల్యేలుగానే ఉన్నారని, పిటిషనర్లపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. దీనిపై స్పందించిన చీఫ్‌ జస్టిస్‌ కమిషన్‌ రిపోర్టు ఇంకా తమకు అందలేదన్నారు. కమిషన్ నివేదికను వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఒకవేళ వెబ్‌సైట్‌లో  ఉంటే రిపోర్టును వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. 

దీనికి సమాధానంగా ఏజీ మాట్లాడుతూ...నివేదికను ప్రభుత్వం ఎక్కడా పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదన్నారు. ఒకవేళ పెట్టి ఉంటే వెంటనే తీసేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఆదేశించారు. దీని తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమన్నారు చీఫ్‌ జస్టిస్‌. అసెంబ్లీలో చర్చ ఉంది కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నారు. మూడు వారాల్లో పూర్తి కౌంటర్‌ దాఖలు చేయాలని..కేసీఆర్‌, హరీష్‌రావుకు చీఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం ఆదేశించింది. న్న ధర్మాసనం