Heavy rains lashed Hyderabad: హైదరాబాద్ ను వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకూ ఎండగా ఉన్న వాతావరణం తర్వాత ఒక్క సారిగా మారిపోయింది. మూడు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం.. అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున కురిసింది. గంట, రెండు గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో ఎక్క్డ చూసినా నీళ్లే కనిపించాయి. అన్ని రోడ్లూ మోకాలి వరకూ నీళ్లలో మునిగిపోయాయి.
నీళ్లు నిలిచిపోయిన చోట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్దీకరించారు. అయితే నీటి కారణంగా.. వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల ట్రాఫిక్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది.
హైదరాబాద్ మొత్తం ఒకే తరహాలో వాహన దంచి కొట్టడంతో పలు చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చింది.
బోయిన్ పల్లి మార్కెట్ వద్ద వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ దృశ్యాలను కొంత మంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వర్షాకాలం ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ సరైన వర్షం పడలేదన్న భావనలో నగర వాసులు ఉన్నారు. అందుకే మరిన్ని మంచి వర్షాలు పడాలని కోరుకుంటున్నారు.