మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. జులై 19 నుంచి వాయువ్య భారతదేశంలో, జూలై 18 నుంచి ఈశాన్య రాష్ట్రాలు & సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు దంచి కొట్టనున్నాయని అంచనా వేసింది. "రుతుపవన ద్రోణి కొద్దిగా ఉత్తరం వైపుకు మళ్లింది. రాబోయే 2-3 రోజుల్లో దాని సాధారణ స్థితికి వచ్చే ఛాన్స్ ఉంది." అని వాతావరణ సంస్థ తెలియజేసింది.
జూలై 20న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ & ఉత్తరప్రదేశ్‌లలో చాలా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జులై 18,19 తేదీల్లో రాజస్థాన్‌లో వర్షాలు పడనున్నాయి. ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ & సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో జులై 18, 19 తేదీల్లో కుండపోత ఖాయమని చెబుతోంది.
18, 19న కొంకణ్, గోవాలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 18 నుంచి 20 జూలై వరకు కర్ణాటక, 19, 20 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, 21, 22 తేదీల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, 20 నుంచి 22 వరకు విదర్భ, 19 నుంచి 22 వరకు ఛత్తీస్‌గఢ్, జులై 18 నుంచి 22 వరకు కేరళలో వర్షాలు భారీగా కురిచే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
జులై 18, 19 తేదీలలో విదర్భలో పశ్చిమ మధ్యప్రదేశ్ 18 నుంచి 20 వరకు, తూర్పు మధ్యప్రదేశ్‌లో జులై 18, 21, 22 తేదీల్లో చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18న మరాఠవాడ &ఉత్తరాధ్ర, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, గుజరాత్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక 18, 19న, 18-20 మధ్య తమిళనాడు, జూలై 18, 22 తేదీల్లో తెలంగాణపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది.
ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో రాబోయే 5 రోజులలో విస్తారంగా తేలికపాటి / మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులలో చత్తీస్‌గఢ్, విదర్భ, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్‌లలో చాలా విస్తృతంగా/విస్తృతంగా తేలికపాటి/మోస్తరు వర్షపాతం, ఉరుములు/మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
మత్స్యకారుల హెచ్చరిక:
దక్షిణ ఒడిశా, ఆనుకుని ఉన్న ఉత్తరాంధ్ర తీరాల వెంబడి 60 kmph నుంచి 60 kmph వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అందువల్ల జులై 18, 19 తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ.