ABP  WhatsApp

Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో దారుణం, రెండేళ్లుగా బాలికపై యువకుడు లైంగిక దాడి!

ABP Desam Updated at: 18 Jul 2022 04:18 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బాలికకు మాయమాటలు చెబుతూ రెండేళ్లుగా ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో అసలు విషయం బయటపడింది.

కామారెడ్డి జిల్లాలో మైనర్ పై లైంగిక దాడి

NEXT PREV

Kamareddy Crime : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు 16 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఓ కాలానికి చెందిన బాలిక (16) పై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి మాయమాటలతో లోబర్చుకొని లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపారు. బాలిక తండ్రి కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 



(నిందితుడు కిరణ్) 


రెండేళ్లుగా లైంగిక దాడి 



జులై 11న స్థానికంగా ఓ కాలనీకి చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వచ్చి తన ముగ్గురు పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేశారు. వారిని ట్రేస్ అవుట్ చేసి 13వ తారీఖున పేరెంట్స్ కు అప్పజెప్పాము. అయితే పిల్లల్ని ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే బాసర వెళ్లారని తెలిపారు. 15వ తేదీన పెద్ద అమ్మాయి కడుపు నొప్పి వస్తుందని వాళ్లమ్మకు చెప్పింది. ఏమైందని గట్టిగా అడిగితే ఆ అమ్మాయి జరిగిన విషయాన్ని చెప్పింది. బాలికకు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతడు రెండేళ్లుగా బాలికకు మాయమాటలు చెబుతూ లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. యువకుడిపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటాం.  - నరేశ్, కామారెడ్డి ఎస్హెచ్వో



(కామారెడ్డి ఎస్హెచ్వో నరేశ్ ) 


మహిళ దారుణ హత్య


గుంటూరు జిల్లా పెదకాకానిలో మద్యం మత్తులో దారుణం జరిగింది. ఓ మహిళ దారుణమైన తరహాలో హత్యకు గురైంది. ఈ ఘటన పెదకాకాని శివారులోని యువజన నగర్ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు శివనాగరాజు కాలనీకి చెందిన ఝూన్సీకి ఇద్దరు సంతానం ఉన్నారు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు.. గత కొంత కాలం క్రితం ఝాన్సీ భర్త చనిపోయాడు. పెద్ద కుమార్తెకు కూడా భర్త చనిపోవడంతో పుట్టింట్లో తల్లి వద్దనే ఉంటూ ఉంది. అదే ప్రాంతానికి చెందిన  రసూల్,  సతీష్ బాబు తన కుమార్తెతో మాట్లాడుతున్నారని వారిని ఝాన్సీ అసభ్య పదజాలంతో కనిపించినప్పుడల్లా తిట్టేది. మద్యం అలవాటు ఉన్న ఆమెతో మంచిగా ఉన్నట్లు నటించిన రసూల్, సతీష్ ఆదివారం మద్యం తాగేందుకు ఆటోలో పెదకాకాని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్స్ వెనుక యువజన నగర్ సమీపంలో ఉన్న ప్లాట్లలోకి తీసుకొచ్చారు. ముగ్గురు మద్యం తాగారు. కారణం లేకుండా ఇంటివద్ద ఎందుకు తిడుతున్నావని నిలదీశారు.


ముగ్గురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఝాన్సీని కర్రతో కొట్టి, బీరు బాటిళ్లతో విచక్షణా రహింతంగా పొడిచి పారిపోయారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఝాన్సీ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Published at: 18 Jul 2022 04:18 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.