Heavy Rain In Hyderabad | హైదరాబాద్: హైదరాబాద్ నగర వాసులకు ఎండల నుంచి ఉపశమనం అభించింది. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి అని అంచనా వేశారు. 


ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి వాన పడుతోంది. రాత్రి వేళ సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, రామంతాపూర్, కోఠి, అబిడ్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, లక్డికాపుల్, సెక్రటేరియట్, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, Ameerpet, పంజాగుట్ట, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వర్క్ ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయిన నగరవాసులు వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయారు. కొన్నిచోట్ల రైతులకు పంట నష్టం వాటిల్లే అవకాశం ఉండగా, మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో పంటలకు నష్టం కలగనుంది.




తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2, 3 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. మరో రెండు, మూడు రోజులపాటు తెలంగాణలో వాతావరణం ఇలాగే ఉండనుంది. ఐతే గత కొన్ని రోజులనుంచి ఎండల నుంచి ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు వర్షంతో ఉపశమనం కలిగింది. రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రతలు దిగిరానున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలతో పాటు డెంగ్యూ లాంటి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






 


Also Read: Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!