కూల్చివేసిన, భవన నిర్మాణ వ్యర్ధాలను ఇంటింటికీ వెళ్లి సేకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కన్‌స్ట్రక్షన్‌ వేస్టేజీని ఎక్కడ పడితే అక్కడ పారబోస్తున్న నేపథ్యంలో బల్దియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి అనుమతులు లేనిచోట వ్యర్ధాలను పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


జీహెచ్ఎంసీ పరిధిలో  రోజువారిగా  2000 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు  జనరేట్ అవుతాయని అంచనా! రోజువారి లక్ష్యంగా ఏ రోజుకారోజు వ్యర్థాలను సేకరిస్తోంది జీహెచ్‌ఎంసీ. ప్రజలకు ఇబ్బందులు  లేకుండా నగరంలో నలువైపులా 4 రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. తద్వారా జనరేట్ అయ్యే 2000 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్ధాలు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ అవుతున్నాయి. సర్కిల్‌కు కేటాయించిన ఏజేన్సీల టోల్ ఫ్రీ నంబర్ కు  ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వచ్చి వ్యర్ధాలను తరలిస్తారు. అందుకోసం యూజర్ చార్జీలు పే చేయాలి.  లేదంటే వ్యర్ధాలను జనరేట్ చేసిన వారు స్వయంగా ప్లాంట్ వద్దకు తరలించే వెసులుబాటు కూడా ఉంది. అయితే, యూజర్ చార్జీలు తక్కువ చెల్లింవలసి ఉంటుంది.


ఒక్కొక్క సర్కిల్‌కు 2 నుంచి 6 టన్నుల కెపాసిటీ గల రెండు చిన్నవాహనాలను, 16 నుంచి 25 టన్నుల కెపాసిటీ గల పెద్ద వాహనాలను ఏర్పాటు చేశారు. నగరంలో ఫతుల్లాగూడ,  జీడిమెట్లలో రోజుకు 500 టన్నుల కెపాసిటీ గల రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయగా నూతనంగా శంషాబాద్, తూముకుంటలోనూ ప్లాంట్లను నెలకొల్పారు.


భవన నిర్మాణ వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తే కఠిన చర్యలు


Construction and debris C&D వ్యర్ధాలను రోడ్డుపైన పడవేయడం వల్ల నాలాలు పూడుకుపోతున్నాయి. డ్రైనేజీల్లోకి జారుకుంటున్నాయి. ఫుట్ పాత్‌లు మూసుకుపోతున్నాయి. ఓపెన్ ప్రదేశాలలో వేయడవల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. అందుకే భవన నిర్మాణ వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జిహెచ్ఎంసి తగిన చర్యలు చేపట్టింది.   సర్కిళ్ల వారీగా C&D కాంట్రాక్టర్లను కేటాయించింది.


జీడిమెట్ల రీసైక్లింగ్ ప్లాంట్ ఏరియా వివరాలు:


యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి, చందా నగర్, ఆర్.సి పురం & పటాన్‌ చెరువు, మూసాపేట, కుకట్ పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల కు టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159. యూజర్ చార్జీలు మెట్రిక్ టన్నుకు రూ.398.50. ఒకవేళ స్వయంగా రీసైక్లింగ్ ప్లాంట్ కు రవాణా చేస్తే యూజర్ చార్జీలు మెట్రిక్ టన్నుకు రూ. 99.62 చెల్లించాలి.


ఫతుల్లగూడ  C&D రీసైక్లింగ్ ప్లాంట్  ఏరియా వివరాలు:


ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్, మలక్ పేట్, సంతోష్ నగర్, అంబర్ పేట్ 7 సర్కిళ్లలకు . టోల్ ఫ్రీ నెంబర్ 1800 120 1159 . యూజర్ చార్జిలు:- మెట్రిక్ టన్నుకు రూ.388.75. స్వయంగా జనరేట్ చేసిన వ్యక్తి ప్లాంట్ వద్దకు తరలిస్తే టన్నుకు రూ.97.20 చెల్లించాలి.


షాతంరాయి శంషాబాద్ C&D కలెక్షన ఏరియా వివరాలు:


చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 203 0033. యూజర్ చార్జీలు మెట్రిక్ టన్నుకు రూ.405. స్వయంగా జరేట్ చేసిన వ్యక్తి ప్లాంట్ వద్దకు తరలిస్తే మెట్రిక్ టన్ను కు రూ.101.25 చెల్లించాలి.


శామీర్ పేట్ మండలం తూముకుంట  C&D కలెక్షన్ ఏరియా వివరాలు:


కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, బేగంపేట్. టోల్ ఫ్రీ నెంబర్ 1800 203 0033. యూజర్ చార్జీలు మెట్రిక్ టన్ను కు రూ.435. స్వయంగా ప్లాంట్ వద్దకు తరలిస్తే టన్నుకు రూ.108.75.


నగరవాసులు సహకరించాలి


పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ హైదరాబాద్ కృషి చేస్తున్న ప్రజలు పూర్తిగా సహకరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేసింది. భవన నిర్మాణ వ్యర్ధాలను ఎక్కడ పడితే అక్కడ వేసి నగర వాసులకు ఇబ్బంది కలిగించొద్దని కోరింది. నియమాలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని జిహెచ్ఎంసీ హెచ్చరించింది.