Woman Dies of eating Momos in Hyderabad | హైదరాబాద్: మోమోస్ తిని మహిళ మృతిచెందిన ఘటనలో జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. మోమోస్ తయారు చేసిన సంస్థను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా తిను పదార్థాలు విక్రయిస్తున్నారని బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని నందినగర్ సింగాడకుంట బస్తీకి చెందిన శుక్రవారం మోమోస్ తిని, తీవ్ర అస్వస్థతకు గురై చనిపోవడం తెలిసిందే.
నందినగర్ సంతలో మోమోస్ తిన్న మరో 40, 50 మంది వరకు అస్వస్థతకు లోనై నగరంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మయోనైజ్ అనే పదార్ధం కలుషితం కావడంతో రేష్మ బేగం (31) మృతి చెందినట్లు ప్రాథమికంగా భావవిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో షవర్మ తిని పలు సందర్భాలలో పలువురు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. షవర్మ లోనూ గుడ్డుతో తయారుచేసిన మయోనైజ్ అనే పదార్ధం కలుషితం కావడంతో షవర్మ తిన్నవారు అస్వస్థతకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఈ పదార్ధాన్ని నిషేధించాలని కోరుతూ జీహెచ్ఎంసీ అధికారులు కొన్ని రోజుల కిందట ప్రభుత్వానికి లేఖ రాశారు.