Kancha Gachibowli Lands Issue | హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల అంశంలో బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ (Krishank Manne)కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ భూమల విషయంలో ఏఐ టెక్నాలజీ వినియోగించి ఫోటోలు, వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని బీఆర్ఎస్ (BRS) నేత క్రిశాంక్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 9, 10 తేదీలలో విచారణకు హాజరు కావాలని నోటీసులలో గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంత్ మీద గత 16 నెలల కాలంలో 21 కేసులు నమోదయ్యాయి.

Continues below advertisement


రంగారెడ్డి జిల్లాలోని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం అంశం బయటకు రావడంతో అవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూములు అని, అటవీ భూములు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. హెచ్‌సీయూ విద్యార్థులు తమ భూములను లాక్కోవద్దంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు సైతం ఆ భూముల జోలికి రావొద్దని, అభివృద్ది పేరుతో వినాశనం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో జింకలు చనిపోయిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కొన్ని ఏఐ జనరేటెడ్ ఫొటోలు సైతం సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది. జాతీయ స్థాయికి వివాదం వెళ్లడం, సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అందులో ఏ పనులు చేయవద్దని ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నష్ట నివారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు హెచ్‌సీయూ భూముల పిటిషన్లన


నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ నేత 


మన్నే క్రిశాంక్ బీఆర్ఎస్ నేత నోటీసులపై స్పందించారు.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే నాకు నోటీసులు ఇచ్చింది. మేం ఎక్కడా AI వాడలేదు. టెక్నాలజీ వాడి వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేయలేదు. ఇటీవల HCU కు సంబంధించి విడుదల చేసిన ఫోటోలు, వీడియోలు అన్ని వాస్తవమే. ఈ నోటీసులను మేం లీగల్ గా చట్టపరంగానే ఎదుర్కోటాం. జింకలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చాయి, ఇళ్లలోకి కూడా వెళ్ళాయో.. అవన్నీ వీడియోలు ఉన్నాయని’ స్పష్టం చేశారు.



‘అక్కడ జింకలు లేవు, అక్కడ నక్కలు మాత్రం ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు, ఇక్కడకు ఎవరు రావొద్దు అని ప్రకటనలు సైతం చేశారు. కానీ Ai తో వీడియోలు క్రియేట్ చేశారని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. అసలు కాంగ్రెస్ కు Ai గురించి మాట్లాడే అర్హత ఉందా. జాతీయ స్థాయిలో ఆ వీడియోలలో జింకలు,నెమళ్లు ఉన్నాయని తేలింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నాపై 4 కేసులు పెట్టింది. 


ఇంతకీ అక్కడ జింకలు చనిపోవడానికి కారణం ఎవరు, ఆ చెట్లను నరకడానికి కారణం ఎవరు? ఇందుకు కారణం అయిన వారిపై కదా కేసులు పెట్టాల్సింది. కొందరు రూ.20 వేలు ఇచ్చి మరీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేపిస్తున్నారు. నేను మాత్రం ఎలాంటి ఏఐ వీడియోలు, ఫొటోలు క్రియేట్ చేయలేదు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశా అనేది మొత్తం అబద్ధం’ అన్నారు.