PM Modi meeting in LB Stadiam: హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ జరగనున్నందున కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత నారాయణపేట సభలో మోదీ పాల్గొని.. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియం సభలో పాల్గొంటారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని.. ఎన్నికల సందేశాన్ని ఇస్తారని అన్నారు.


రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు ఉదయం నారాయణపేట సభలో మోడీ పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సభలో మోడీ పాల్గొంటారు. తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.. ఎన్నికల సందేశాన్ని ఇస్తారు.. ఎన్నికల జిమ్మిక్కులు చేస్తూ బట్టకాల్చి మొహం మీద పడేసే ప్రయత్నం చేస్తున్నాయి కాంగ్రెస్, BRS పార్టీలు.. కేసీఆర్ మాటలు ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు.. నవ్వుకుంటున్నారు.. గాడిద గుడ్డు ప్రచారం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అవుతుంది.. తెలంగాణ ప్రజలెవరూ దాన్ని పట్టించుకోవడం లేదు..


హైకమాండ్ ఆదేశాలతో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలను కలుస్తాం.. ఎన్ని తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేసిన బీజేపీ పార్టీకి నాకు ఢోకా లేదు.. అండర్ కరెంట్, ఓపెన్ కరెంట్ ఉంది.. ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.. తెలంగాణకు ఇది కీలకమైన సభ.. 5 పార్లమెంట్ నియోజవర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ సభలో పాల్గొంటారు.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు, యువత అందరి సభకు రావాలి.. మోడీకి మనమంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది..


ఏ ఫ్రంట్ కూడా మోడీకి ప్రత్యామ్యయంగా లేదు.. కాంగ్రెస్ కు విమర్శించడానికి ఏం లేదు.. కాబట్టి దుష్ప్రచారాలు చేస్తుంది.. రిజర్వేషన్స్ అంశమపైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేసింది.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ఏ ఒక్కరు సీరియస్ గా తీసుకోవడం లేదు.. రిజర్వేషన్స్ అంశంపై డైరెక్ట్ చేసిన రాహుల్ గాంధీ సినిమా ఫ్లాప్ అయ్యింది.. సెకండ్, థర్డ్ ప్లేస్ వస్తుందని రేవంత్ రిజర్వేషన్స్ అంశాన్ని ప్రచారం చేస్తున్నారు.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం..’’ అని కిషన్ రెడ్డి అన్నారు.