TS ECET 2024 Preliminary Key: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించిన టీఎస్ ఈసెట్-2024 ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 12 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అభ్యంతరాలు తెలపాలి.
Download Response Sheet (Candidate Specific)
Master Question Papers With Preliminary Key
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్-2024' నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష కోసం ఫిబ్రవరి 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఆలస్యరుసుములో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించారు. కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజుగా రూ.900 వసూలు చేశారు. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల నుంచి రూ.500 వసూలు చేశారు. ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 28 మధ్య దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 1 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.
మే 6న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 99 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇందులో తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రిజీయన్‌లో 44, ఏపీలో 7 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరీక్ష జరగనుంది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్‌ను ఈసెట్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమెటిక్స్) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 180 నిమిషాలు (3 గంటలు).
ALSO READ:
ఏపీ ఆర్జీయూకేటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు మే 6న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 8న ప్రారంభమైంది. ప్రవేశాలు కోరువారు జూన్ 25న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..