Eetala Rajender Fires on CM KCR About Junior Panchayat Secretaries Protest: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక పత్రాలు పొందిన గ్రామ కార్యదర్శులకు 3 సంవత్సరాలు ప్రొబేషన్ పెట్టారని గుర్తు చేశారు. రెండు సంవత్సరాలు తగ్గించమని కోరితే 4 ఏళ్లకు పెంచారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ చక్రవర్తి ఏం కాదని విమర్శించారు. అలాగే ఆయన తన సొంత సంపాదనను గ్రామ కార్యదర్శులలకు ఇవ్వట్లేదని ఫైర్ అయ్యారు.


ఉద్యోగాలు పర్మినెంట్ చేయమని అడుగుతుంటే గ్రామ కార్యదర్శుల (Junior Panchayat Secretaries)ను వేధించడం దారుణం అన్నారు. ఆర్టీసీ కార్మికుల చావుకు సీఎం కేసీఆర్ యే కారణం అయ్యారని ఆరోపించారు. గ్రామ కార్యదర్శులను తొలగించే అధికారం ముఖ్యమంత్రికి లేదన్నారు. బేషజాలకి పోకుండా పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని న్నారు. సీపీ టెంట్లు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే సీఏ, వీపీఓలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ మహిళలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే ఈటల అన్నారు.



జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై సర్కారు సీరియస్, విధుల్లో చేరకపోతే టర్మినేట్ చేస్తామని హెచ్చరికలు 
తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు విధుల్లో చేరాలని జేపీఎస్ లకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే.. విధుల్లో చేరని వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ నోటీసులను జారీ చేశారు. అంతేకాకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడం.. నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొన్నారు. జేపీఎస్ యూనియన్ ఏర్పాటు చేయడం, స్మమెకు దిగడం చట్ట విరుద్ధం అని తెలిపారు. ప్రభుత్వంతో కుదుర్కుచుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ సర్వీస్ డిమాండ్ తో 2023 ఏప్రిల్ 28వ తేదీ నుంచి జేపీఎస్ యూనియన్ గా ఏర్పడి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసుల్లో సుల్తానియా పేర్కొన్నారు.


జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా తను సొసైటీలు, యూనియన్లలో చేరనని బాండ్ పై సంతకం చేశారని గుర్తు చేశారు. అగ్రిమెంట్ ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మె చేసే హక్కు లేది ఈ వాస్తవాలు తెలిసినా జేపీఎస్ యూనియన్ గా ఏర్పడి... చట్టవిరుద్ధంగా ఏప్రిల్ 28వ తేదీ 2023 నుంచి సమ్మెకు దిగారని గుర్తు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సమ్మె చేయడం వల్ల జేపీఎస్ ఉద్యోగాల్లో కొనసాగే హక్కును కోల్పోయిందని సుల్తానియా అన్నారు. మానవతా దృక్పథంతో జేపీఎస్ కు చవరి అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని ఆదేశించారు. ఇవాల సాయంత్రం లోగా విధుల్లో చేరని జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరినీ తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేశారు.