తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి .

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగింపు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ రిజల్ట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే టాప్‌ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే 

జిల్లా పేరు  రాసినవాళ్లుపాసైన వాళ్లు ఉత్తీర్ణత శాతం
మేడ్చల్‌625534747475 
రంగారెడ్డి 682895043373 
కుమ్రంభీం43713227 73 
ములుగు1793130672 
కరీంనగర్ 14217 993469
హన్మకొండ 17626 12013 68 

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే 

జిల్లా పేరు  రాసినవాళ్లుపాసైన వాళ్లు ఉత్తీర్ణత శాతం
మెదక్‌63642462 38
నారాయణ పేట్‌4088171241 
జయశంకర్ భూపాల్‌పల్లి1526690 45

వికారాబాద్‌

7859361846

పెద్ద పల్లి

4458205546

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే టాప్‌ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే

జిల్లా పేరు  రాసినవాళ్లుపాసైన వాళ్లు ఉత్తీర్ణత శాతం
ములుగు 16321397 85
కుమ్రంభీమ40003249 81
మేడ్చల్‌508213844638446
ఖమ్మం13339 9964 74
హన్మకొండ 144141062773 

 

ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ జిల్లాల వారీగా చూస్తే తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్న జిల్లాలు ఇవే 

జిల్లా పేరు  రాసినవాళ్లుపాసైన వాళ్లు ఉత్తీర్ణత శాతం
మెదక్‌5320278552 
నాగర్ కర్నూల్5110279154
వరంగల్‌57293358 58 
నారాయణ పేట్‌3337194258 
సూర్యపేట6345376459