మీర్పేట్ లో ఈఏడాది జనవరిలో జరిగిన హత్య గతంలో ఎన్నడూ లేనంతగా టెర్రర్ పుట్టించింది. హత్య కేసులలో మీర్పేట్ కుక్కర్ హత్య వేరు అనేంతలా అత్యంత దారుణంగా భార్యను చంపిన తీరు, తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరూ ఉలిక్కిపడేలా చేసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి పుట్టా గురుమూర్తి , తన భార్య మాధవిని పక్కా ప్లాన్ తో హత్య చేయడమేకాదు, ఏకంగా పోలీసులకు సవాలు విసిరేలా ఆధారాాలు సైతం మాయం చేసిన తీరు క్రైమ్ కేసులు చేధించిన ఉద్దండులకే మతిపోయేలా చేసింది. ఇంతలా సంచలనం సృష్టించిన మీర్పేట్ గురుమూర్తి కేసులో తాాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.

Continues below advertisement

 భార్యను దారుణంగా చంపడానికి భార్య, భర్తల మధ్య గొడవలు, మనస్పర్దలు,  పుట్టింటికి వెళుతుందనే ఆగ్రహం, ఇలా ఇవన్నీ కారణాలని ఇప్పటి వరకూ అంతా అనుకున్నారు. కానీ వీటిని మించిన ప్రేమాయణం, మరదలితో సాగించిన అక్రమసంబధమే కారణమనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానళ్లలో చక్కర్లు కొడుతున్నాయి.

 ఆ ప్రచారం నమ్మొద్దంటున్న పోలీసులు..

Continues below advertisement

నిందితుడు పుట్టా గురుమూర్తి , తన మరదలితో గత కొంత కాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని,  ఈ విషయం భార్య మాధవికి తెలియడంతో నిలదీసిందని, ఇదే విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులతో చెప్పడంతో గురుమూర్తిని హెచ్చరించారని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఊరు పెద్దల్లో పంచాయితీ పెట్టినా గురుమూర్తి తీరు మారలేదనే, మరదలి కోసమే భార్యను కిరాతకంగా చంపాడనే వార్తలు , వీడియో కథనాలు మీడియాలో సంచలనంగా మారాయి. ఇంట్లో ఎవరూ చెప్పినా వినకుండా మరదలితో ప్రేమాయణం కొనసాగిస్తున్న గురుమూర్తికి , ఇదే విషయంపై తరుచూ భార్య మాధవితో గొడవలు పడేవాడని,  మరదలితో ప్రేమాయణం ఇంట్లో అందరికీ చెప్పి తనను అల్లరి చేస్తోందని భార్య మాధవిపై కక్ష పెంచుకుని అత్యంత దారుణంగా చంపాడనే ట్విస్ట్ పెను దుమారం రేపుతోంది.

అయితే ఈ వార్తలను మీర్పేట్ పోలీసులు ఖండిస్తున్నారు. ఏడాది జనవరి నెలలో సంక్రాంతి సెలవులకు పిల్లలను బంధువుల  ఇంటికి పంపి,. ఇంట్లో పిల్లలు లేని సమయంలో కావాలనే భార్య మాధవితో గొడవడి,గొంతు నులిమి ఆమె ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఆధారాలు దొరకకుండా మాయం చేసేందుకు భార్య శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి , కుక్కర్ లో ఉడబెట్టాడు.ఇలా ఎముకలను సైతం గ్రైండర్ చేసి, సమీపంలోని చెరువులో కలిపేశాడు. దుర్వాసన రాకుండా రూమ్ స్ప్రే కొట్టి, ఏం తెలియనట్లుగా సైలెంట్ అయ్యాడు.అమ్మ ఏమైయ్యిందని అడుగుతున్న పిల్లలకు కట్టుకథలు చెప్పాడు. మాధవి తల్లిదండ్రులకు అనుమానం రావడంతో మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఒళ్లు గగుర్పొడిచే సీన్ బయటపడింది.

చట్టపరంగా చర్యలు తీసుకుంటాం:  SHO , మీర్పేట్ పోలీస్టేషన్

ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ, మీడియా మిత్రులకు ఓ విన్నపము ఏంటంటే.. గురుమూర్తికేసుకు సంబంధించిన విషయంలో పలు మీడియాలలో వస్తున్న కథనాలకుకు సంబంధించిన విషయం పూర్తిగా అవాస్తవమైనది. గురుమూర్తి కేసు హానరబుల్ కోర్టులో ట్రైల్  అవుతున్నది. ఈ సమయంలో ఇలాంటి అవాస్తవమైన విషయాలను ప్రచారములోకి తీసుకురావడం వల్ల బాధితురాలు కుటుంబం చాలా ఆవేదనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గురుమూర్తి కేసులో తాజాాగా మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దు. అలాగే మీడియాలో వాటిని వేయవద్దు. అలా తప్పుడు ప్రచారం ప్రసారం లేదా ప్రచురించడం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - మీర్పేట్ పీఎస్ SHO