Telangana Mass Killing News:రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై ఫోక్సో కేసు పెట్టారన్న కసితో ఒక వ్యక్తి బెయిల్‌పై వచ్చి ఆరుగురిని హత్య చేశాడు. తనపై కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, తన కుటుంబంలోని వారిని అర్ధరాత్రి ఊచకోత కోశాడు.
మే 16 రాజ్‌కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని దైవాలగూడలో ఒక బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. దీనికి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడికి ఈ మధ్య బెయిల్ వచ్చింది. బెయిల్ రావడంతో అజ్ఞాతంలో ఉన్న రాజ్‌కుమార్ ఇప్పుడు ఊరిలోకి వచ్చి వీరంగం సృష్టించాడు. వచ్చీరాగానే దైవాలగూడలో చేరుకున్న ఆ వ్యక్తి అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. ఇంత దారుణంగా ఆరుగురిని చంపేసిన రాజ్‌కుమార్ కూల్‌గా తన పేరెంట్స్‌కు ఫోన్ చేశాడు. తనపై అక్రమంగా పోక్సో కేసు పెట్టిన వారిని, సహకరించిన వారిని చంపేసిన నట్టు చెప్పాడు. అంతే కాకుండా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. వాడి మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం చేయాలో తెలియక, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తన కుమారుడు ఇలా అంటున్నాడని చెప్పారు. వారి మాటల విన్న పోలీసుల్లో కంగారు మొదలైంది. ఆరుగురిని చంపేయడం ఏంటని టీం స్పాట్‌కు వెళ్లింది.
అయితే ఇంతటి దారుణానికి నిందితుడు ఒడిగట్టేందుకు పోలీసులే కారణమని గ్రామస్తులంతా ఆందోళనబాటపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైకి వచ్చి పోలీసుల తీరును తప్పుపట్టారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని చెప్పారు. అందుకే నిందితుడు బరితెగించాడని ఆరోపిస్తున్నారు.
సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో ఇలాంటి సీన్స్ చూస్తేనే కళ్లు మూసుకుంటాం, లేదంటే ఆ సీన్‌ను స్కిప్ చేస్తాం. కానీ రాజ్‌కుమార్ మాత్రం అర్థరాత్రి చేసిన దుర్మార్గం చెప్పడానికి మాటలు రావు. ఎక్కడ పడుకున్న వారిని అక్కడే కిరాతకంగా నరికి చంపాడు. తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివరకు తీసుకెళ్లి రేప్ చేసి చంపేసినట్టు తెలుస్తోంది. తన భార్య, బిడ్డలను పడుకున్న బెడ్‌పైనే కళ్లు తెరవకుండానే ఆయువు తీసేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను కూడా పడుకున్న చోటే లేవకుండా చేసి గొంతులు కోసేశాడు.
పోలీసులు స్పాట్‌కు చేరుకొని అక్కడ పరిస్థితులు చూసి షాక్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బాలిక ఫిర్యాదు మేరకు మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చిన రాజ్ కుమార్ పదే పదే వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. తనపై కేసు పెట్టిన వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించాడు. ఇదే విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చామని గ్రామస్థులు అంటున్నారు. అప్పుడే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే, ఆరుగురు ప్రాణాలు దక్కేవి అని అంటున్నారు.
