Crime:
ఈ కుంభకోణంలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో డైరెక్టరుగా ఉన్న మిల్లి గోయల్.. క్లర్కుగా పనిచేస్తున్న శివనిలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 430 మంది విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. దీని కోసం ఒక్కో విద్యార్థి నుంచి లక్షా 50 వేల నుంచి రూ. 2 లక్షల 50 వేల వరకు వసూలు చేేసినట్లు పేర్కొన్నారు. ఈ దందా 5 సంవత్సరాలుగా జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. ముఖ్యంగా బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ, బీఎస్పీ కంప్యూటర్స్ లాంటి కోర్సుల విద్యార్థులు ఈ నకిలీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నిందితుల నుంచి యూనివర్శిటీకి సంబంధించిన సర్టిఫికెట్లు, ల్యాప్ టాప్, స్టాంపులు, రూ. 50 వేల నగదు, 7 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ. 37 లక్షల 50 వేలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.