Gandpet Park : జంట నగర వాసులకే తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ గండిపేట గురించి తెలుసు. అక్కడ ఎన్టీఆర్ కుటీరం నిర్మించుకున్నప్పటి నుండి ఇప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. దానికి కారణం జలాశయం. వారాంతాల్లో సేదదీరేందుకు చాలా మంది గండిపేట జలాశయం వద్దకు వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ ప్రత్యేకంగా పర్యాటకుల కోసం ఏర్పాట్లు ఉండవు. ఇటీవలి కాలంలో సౌకర్యాలు మెరుగుపడినా.. అక్కడో ఓ మంచి పార్క్..జలాశయం ఒడ్డున ఉంటే బాగుంటుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్‌కు కూడా అలాగే అనిపించింది. అందరికీ అనిపించడం వేరు.. కేటీఆర్‌కు అనిపించడం వేరు. ఆయనకు అనిపిస్తే చేయడానికి చాన్స్ ఉంటుంది. అనుకున్న వెంటనే చేసేశారు కూడా.
గండిపేటలో అద్భుతమైన పార్క్ నిర్మాణం పూర్తి !
గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పార్కులో యాంఫీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. గండిపేట పార్కును అద్భుతంగా తీర్చిదిద్దిన అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు, హెచ్ఎండీఏ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అందమైన హైదరాబాద్ నగరానికి ఈ పార్కు మరింత శోభను తీసుకొస్తుందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కేటీఆర్ ఆలోచన.. అధికారుల కార్యచరణ
గండిపేట్ పార్కును 5.50 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. రూ. 35.60 కోట్ల వ్యయంతో పార్కును ఏర్పాటు చేశారు. సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్‌లు, ఎంట్రెన్స్ ప్లాజా, వాక్‌వేస్, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్ టెర్రస్, పిక్‌నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను రూ.35.60 కోట్ల వ్యయంతో నిర్మించారు.
మూడు రోజుల పాటు తెలంగాణ విలీన ఉత్సవాలు - బీజేపీకి కౌంటర్‌గా కేసీఆర్ నిర్ణయం !
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్
హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో అనేక రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో ఎటు వైపు చూసినా ఫ్లై ఓవర్లు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రపంచస్థాయి సౌకర్యాలతో శివార్లలో ప్రజల మనోవికాసానికి అవసరమైన పార్కులు.. ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. శివార్లలోనూ ఇలాంటి అభివృద్ధి సాధించడంపై కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
తెనాలిలో "అన్న క్యాంటీన్" రగడ - అక్కడ కర్ఫ్యూ కంటే ఎక్కువగా రూల్స్ !