Telangana News :   తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. భారతావనిలో తెలంగాణ అంతర్భాగమై సెప్టెంబర్ 17వ తేదీకి 74  ఏళ్లు నిండుతాయి.    స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్‌ రాజ్యం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది.   ఈ నెల 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటేలా సంబురాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది.


మూడు రోజుల పాటు తెలంగాణ విలీన వేడుకలు.... స్వాతంత్య్ర వేడుకలను మించి!


స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.  వీరుల త్యాగాలను స్మరిస్తూ, జాతీయ స్ఫూర్తిని, సమైక్యతా భావాన్ని భవిష్యత్‌ తరాలకు అందించడమే లక్ష్యంగా, తెలంగాణ ఖ్యాతిని ఎలుగెత్తి చాటడమే ధ్యేయంగా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.  తెలంగాణ నేల సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచారాలకు అద్దం పట్టేలా వేడుకలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నది. శనివారం నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు.  వాటిని తెలంగాణ వజ్రోత్సవాలుగా నిర్వహించాలా, మరొక రకంగానా అన్నదానిపై స్పష్టత ఇస్తారు. 


కేంద్రం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో  అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ 


తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసేవారు. తాము వస్తే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించే వారు.అయితే కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకూ అలా నిర్వహించలేదు. కానీ ప్రతీ ఏడాది భారతీయ జనతా పార్టీ నేతలు సెప్టెంబర్ 17వ తేదీన విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురువేయడానికి ప్రయత్నిస్తూంటారు.  వారిని పోలీసులు అడ్డుకుంటారు. ప్రతీ ఏడాది ఇలాగే జరుగతుంది. అయితే ఈ సారి మాత్రం రెండు పార్టీలు ప్లాన్ మర్చేశాయి. 


ఏడాదంతా వజ్రోత్సవాలు చేయాలన్న ఆలోచనలో బీజేపీ 


కేంద్ర ప్రభుత్వం విమోచనా దినోత్వసాన్ని అధికారికంగా నిర్వహించాలని... కేంద్ర బలగాలతో పరేడ్ కూడా నిర్వహించాలని నిర్ణయించింది.  హైదరాబాద్ స్టేట్‌లోని కొన్ని ప్రాంతాలు మహారాష్ట్ర,  కర్ణాటకల్లో విలీనం కావడంతో అక్కడి సీఎంలను కూడా పిలుస్తున్నారు.దీంతో  బీజేపీకి కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా విమోచనా దినోత్సవాల్ని  ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా ప్రస్తుత  పరిమామాలు ఉన్నాయి. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ వెంటనే దేశంలో విలీనం కాలేదు. కొన్నాళ్ల తర్వాత సైనిక చర్య చేపట్టడంతో నిజాం పారిపోయారు. అప్పుడు హైదరాబాద్ సంస్థానం భారత్‌లో భాగమయింది. 


బీజేపీ అగ్రనేతలు  ఎప్పుడు తెలంగాణ లో బహిరంగ సభ పెట్టినా తెలంగాణ విలీనం , విమోచన గురించి ప్రస్తావించకుండా ఉండరు. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే  హైదరాబాద్ స్టేట్‌ భారత్‌లో విలీనమయిందని చెబుతూ ఉంటారు. 


తెలంగాణ బాధితులకు కేసీఆర్ ఓదార్పు అసాధ్యమా ? సొంత ప్రజలను కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారా ?