Cm Revanth Reddy Review : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో (Loksabha Elections) పార్టీ గెలుపునకు కృషి చేయాలని తెలంగాణ ( Revanth Reddy ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు పిలుపునిచ్చారు.  పార్లమెంటు ఎన్నికల్లో (Parliament Elections) రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. 17లో 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 


26 తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం
జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశం నిర్వహించారు. MCRHRDలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి తొలి సభ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే... ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇంద్రవెళ్లిలోనే మొదటి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. 


ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటా
ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనం కోసం శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులకు అప్పగించారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు. గత ముఖ్యమంత్రిలా వ్యవహరించబోనన్న ఆయన, ఈ నెల 26 తర్వాత అందరి ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి