Telangana -The Future State: తెలంగాణ(Telangana)కు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు. ఇకపై తెలంగాణను తెలంగాణ..ది ప్యూచర్‌ స్టేట్‌( The Future State)గా పిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త నినాదాన్ని వీలైనంత త్వరగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఇకపై రా‌ష్ట్రానికి ఇదే ట్యాగ్‌లైన్‌గా నిలవనుందన్నారు.


తెలంగాణ...ప్యూచర్ స్టేట్‌
తెలంగాణ(Telangana) బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Reavanth Reddy) కీలక ముందడుగు వేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసురావడమే లక్ష్యంగా అమెరికాలో(America) పర్యటిస్తున్న ఆయన...తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ త్వరగా గుర్తుంచుకునేలా ట్యాగ్‌లైన్ సూచించారు. ఇకపై తెలంగాణను తెలంగాణ..దిప్యూచర్ స్టేట్‌( The Future State)గా పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


హైదరాబాద్‌లో నాల్గో నగరంలో నిర్మిస్తున్నామని ఇందులో  భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (A.I)హబ్, నెట్‌ జీరో లాంటి ప్రాజెక్ట్‌లతో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్‌ పూర్తిగా మారనుందన్న ఆయన...అందుకే దీన్ని ది ప్యూచర్‌ స్టేట్‌గా నామకరణం చేశామన్నారు. 


అమెరికాలోని కాలిఫోర్నియాలో  ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌ టేబుల్ యూనికార్న్స్‌ సీఈవోలతో భేటీకి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. మెట్రోసిటీగా ఎదిగిన హైదరాబాద్‌(Hyderabad)ను మరింత విస్తరిస్తున్నామని...కొత్తగా మరో మహానగరమే నిర్మిస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి....పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావాని కోరారు. 


అమెరికా తరహాలో కొత్త నినాదం
అమెరికాలో ఏ నగరానికి ఆనగరం  ప్రత్యేకమేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో వివిధ రాష్ట్రాలు వెళ్లినప్పుడు ప్రతి రాష్ట్రానికి దాని గుర్తింపు తెలియజేసేలా ఓ సరికొత్త ట్యాగ్‌లైన్‌ ఉండడాన్ని సీఎం రేవంత్‌ గమనించారు.  అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్‌ నినాదం కాగా...  టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్  అని పిలుస్తారని తెలుసుకున్నారు. అలాగే  కాలిఫోర్నియాకు యురేకా అనే ట్యాగ్‌లైన్ ఉండడాన్ని గమనించారు. ఇదంతా ఎందుకు అని అక్కడి వారిని సంప్రదించగా....ఇదే తమ బ్రాండ్ నినాదమని చెప్పారు.


ప్రజలకు బాగా గుర్తుండిపోవాలన్నా...నిత్యం తమలో స్ఫూర్తి నింపేలా ఆయా రాష్ట్రాలకు ట్యాగ్‌లైన్ల్‌ పెట్టుకుంటారని తెలిసింది. అక్కడి ప్రజలకు ఎక్కువ ఆ రాష్ట్రం పేరు కన్నా...ట్యాగ్‌లైన్లే గుర్తుంటాయని చెప్పారు. దీంతో అప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ(Telangana)కు ఓ ట్యాగ్‌ల్యాన్ పెట్టారు. తెలంగాణ...ది ప్యూచర్  స్టేట్‌ అంటూ నామకరణం చేశారు.


ఇకపై రాష్ట్రాన్ని అందరూ ఇలాగే పిలవాలని పిలుపునిచ్చారు.  ప్యూచర్‌ స్టేట్‌లో పెట్టుబడులు పెడితే మీ ప్యూచర్‌కు ఢోకా ఉండదని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రానున్నది అంతా ఏఐ టెక్నాలజీ కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఆ తరహా పరిశ్రమలను హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఐటీ పరిశ్రమలకు హైదరాబాద్ స్వర్గధామమని మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం పెట్టుబడులకు అనుకూలమైన విధానాలను అనుసరిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్‌ కంపెనీల వ్యవస్థాపకులు హైదరాబాద్‌ వచ్చి అక్కడి పరిస్థితులను చూసి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు, సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి శీధర్‌బాబు హామీ ఇచ్చారు. తప్పకుండా రాష్ట్రానికి రాావాలని కోరారు.


Also Read: హైదరాబాద్‌లో ఇంటింటా జీఐఎస్‌ సర్వే- ఏం వివరాలు సేకరిస్తున్నారంటే?