Rajiv Yuva Vikasam Scheme Eligibility | హైదరాబాద్: నిరుద్యోగ యువత సొంతంగా తమ కాళ్లపై నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాజీవ్ యువ వికాసం. గత నెలలోనే ఈ పథకానికి దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే దరఖాస్తుదారులకు ఓ విషయం షాకివ్వనుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారిని రాజీవ్ యువ వికాసం పథకానికి అనర్హులుగా భావిస్తూ వారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అప్‌డేట్ మాత్రం రాలేదు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకానికి 16 లక్షల 25 వేల 441 దరఖాస్తులు వచ్చాయి. 5 లక్షల 35 వేల 666 మంది బీసీలు, రెండు లక్షల 95 వేల 908 మంది ఎస్సీలు, 1 లక్షా 39 వేల 112 మంది ఎస్టీలు, ఒక లక్ష 7 వేల 681 మంది మైనారిటీలు, 23 వేల 259 మంది ఈబీసీలు, క్రిస్టియన్ మైనారిటీ నుంచి 2,689 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండో తేదీలోగా దరఖాస్తుల పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
లబ్ధి పొందాలంటే సిబిల్ స్కోరు కీలకంమొత్తం ఐదు లక్షల మందికి రాజీవ్ వికాసం ఇవ్వనున్నారు. మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయనున్నారు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారి అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో తీసుకున్న పర్సనల్ లోన్లు, హోమ్ లోన్, వెహికల్ లోన్, అగ్రికల్చర్ లోన్ తిరిగి చెల్లించని వారు, సిబిల్ స్కోర్ మరీ తక్కువగా ఉన్న వారిని అనర్హులుగా పరిగణిస్తున్నారు. వెరితోపాటు గతంలో ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల్లో భాగంగా లోన్లు పొందినవారు అనర్హులు.
సిబిల్ చెకింగ్ ద్వారా బ్యాంకులకు రూ.16 కోట్ల ఆదాయంరాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ కీలకం కానుంది. అయితే ఎక్కువ అప్లికేషన్ డిస్కవర్ చెక్ చేయడానికి 100 నుంచి 200 రూపాయలు స్పెషల్ చేయాల్సి ఉంటుంది అని బ్యాంకులు చెబుతున్నాయి. ఆఫీసు చెల్లిస్తే సివిల్స్ కూడా చెక్ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ పథకానికి మొత్తం 16 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయని, కొత్త అప్లికేషన్ కు వంద రూపాయలు అనుకున్న 16 కోట్లకు పైగా ట్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. అయితే సిబిల్ స్కోర్ చెకింగ్ ఫీజు నుంచి న్యాయం పై ఇవ్వాలని స్టేట్ లెవెల్ ల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో కోరాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు.