Chandrayan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం (జూన్ 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోట నుంచి మార్క్ ఎం4 వాహన నౌక రోదసిలోకి దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి కౌంట్ డౌన్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు ప్రారంభించింది. 2019 లో చెదిరిన కలను ఈసారి నిజం చేసి చూపాలన్న పట్టుదలతో ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని నిర్వహిస్తోంది. జులై 14వ తేదీన ప్రయోగం జరగనుంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండర్ దిగుతుంది. మొత్తం 40 రోజుల పాటు ప్రయాణించి చంద్రుడిని చేరుతుంది చంద్రయాన్-3. చంద్రయాన్-3 మిషన్ లో హైదరాబాద్ కు చెందిన సంస్థలు కీలక భూమిక పోషిస్తున్నాయి. హైదరాబాద్ లోని ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీలు జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్ మార్క్ III (GSLV Mk-III) అంతరిక్ష నౌక ల్యాండర్, రోవర్ కు సంబంధించిన భాగాల తయారీలో భాగమయ్యాయి.


మార్క్-III రిలీజ్ మెకానిజానికి సంబంధించిన సహ నిర్మాణ భాగాలు


రామచంద్రపురంలోని శ్రీ వెంకటేశ్వర ఏరోస్పేస్ సంస్థ మార్క్-III రిలీజ్ మెకానిజానికి సంబంధించిన సహ నిర్మాణ భాగాలు అందించింది. చంద్రయాన్-3 కోసం మిథాని సంస్థ క్లిష్టమైన మిశ్రమాలను సరఫరా చేసింది. MTAR టెక్నాలజీస్, అనంత టెక్నాలజీస్ సంస్థలు కూడా చంద్రయాన్-3 మిషన్ లోని కీలక భాగాలను సరఫరా చేశాయి. ప్రొపల్షన్, ఆర్బిటర్, ల్యాండర్ మాడ్యూల్స్ లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలను రక్షించడానికి అల్యూమినియం అల్లాయ్ కేస్ ను నాగ సాయి ప్రెసిషన్ ఇంజినీరింగ్ వర్క్స్ తయారు చేసి అందించింది. 


మార్క్-III కోర్ బేక్ ష్రౌడ్, L-110 సెపరేషన్ సిస్టమ్స్, S-200  నాజిల్స్ ఆఫ్ ఫస్ట్- స్టేజ్ మోటార్లు, S-200 సెపరేషన్ సిస్టమ్స్, ఆక్సిలరీ మోటార్లు, చంద్రయాన్-3 లూనార్ మిషన్ కోసం ఇతర భాగాలు సరఫరా చేసినట్లు శ్రీ వెంకటేశ్వర ఏరోస్పేస్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇస్రో మిషన్ లలో శ్రీ వెంకేటశ్వర ఏరో స్పేస్ యూనిట్ కీలక సహకారం అందించిందన్నారు. PSLV, GSLV, GSLV Mk-3, SSLV ప్రోగ్రామ్స్ కు సంబంధించి సబ్ సిస్టమ్స్ ను కూడా సరఫరా చేశారు. మెకానికల్ బ్యాటరీ స్లీవ్ లను నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ సంస్థ తయారు చేసి సరఫరా చేసింది. ISO-ఆమోదిత ఫ్యాబ్రికేటర్ లను URSC, ISRO ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అధిక థ్రస్ఠ్ ను నిరోధించగల బ్యాటరీ స్లీవ్ లను తయారు చేయడానికి 3 నెలల సమయం పట్టినట్లు తెలిపారు. లిక్విడ్ ప్రొపల్షన్ వికాస్ ఇంజిన్, క్రయోజెనిక్ ఇంజిన్, ఫోర్క్ ప్రెజరైజేషన్ కోసం లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ మాడ్యూల్స్, రోల్ కంట్రోల్, పోగో కంట్రోలర్, కమాండ్ సిస్టమ్స్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ, శాటిలైట్ అండ్ ప్రెసిషన్ బాల్ స్క్రూల, హై సైక్లిక్ లైఫ్ వాల్వ్ లు, PSLV, GSLV కోసం హైడ్రాలిక్ యాక్యుయేటర్ అసెంబ్లీలు తయారీలో బాలా నగర్ లోని MTAR టెక్నాలజీస్ కీలకంగా పని చేసింది.