Bandi Sanjay Comments: హిందూ మైనర్ బాలికలను ట్రాప్ చేయడమే లక్ష్యంగా పాతబస్తీలో ఓ ముఠా నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పదుల సంఖ్యలో ఇలాంటి కేసులున్నా.. పోలీసులు కనీసం నిందితులపై FIRలు నమోదు చేయడం లేదన్నారు. పాతబస్తీలో ఇటీవల జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చూపుతూ.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఓ పెద్ద గ్యాంగ్ పనిచేస్తోంది.
పాతబస్తీలో జరుగుతున్న సంఘటనలు ఓ పథకం ప్రకారం నడుస్తున్నాయని సంజయ్ ఆరోపించారు. ఓ పెద్ద నెట్‌వర్క్ ఇందులో ఉందని.. ఈ నెట్‌వర్క్‌లో అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పారు. ఈ మధ్య హిందూ మైనర్ అమ్మాయిని.. బర్త్ డే పార్టీ పేరుతో ఓ ముస్లిం అమ్మాయి పిలిచింది. అక్కడకు చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారు. మత్తు మందు కలిపిన చాక్లెట్‌ను ఇచ్చి ఆ అమ్మాయిని లోబరుచుకున్నారు. నిదానంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయి వీడియోలు తీశారు. విషయం బయటకు చెబితే.. వీడియోలు బయట పెడతామని.. తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు” అని సంజయ్ ఆరోపించారు. ఈ విషయం పోలీసు స్టేషన్‌కు వెళ్లినా ఎలాంటి చర్యలు లేవు. FIRలో నిందితుడు ఆదిల్ పేరును చేర్చలేదు. ఆ అమ్మాయి.. 9మంది బాలికలను ఇలానే ట్రాప్ చేశారని వాళ్ల పేర్లు చెప్పిందని.. కానీ.. వందల సంఖ్యలో అమ్మాయిలను ఇలాగే లోబరుచుకుంటున్నరాని సంజయ్ కామెంట్ చేశారు.
మజ్లిస్ సపోర్ట్ ఉంది.
ఓల్డ్ సిటీలో నడుస్తున్న డ్రగ్స్ దందాకు మజ్లిస్ MIM పార్టీ సపోర్ట్ ఉందని సంజయ్ ఆరోపించారు. వాళ్లని కాదని పోలీసులు ఏం చేయలేకపోతున్నారని .. పోలీసుల నియామకాల్లో జోక్యం చేసుకున్న MIM ఓల్డ్ సిటీ లా అండ్ ఆర్డర్ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుందన్నారు. ఎవరి మీదైనా కంప్లెయింట్ చేస్తే వాళ్ల పేర్లు FIRలో ఉండటం లేదని.. పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చినా MIM నేతలు క్షణాల్లో వాళ్లని తీసుకెళ్లిపోతున్నరని ఆరోపించారు. ట్రాప్ చేసిన అమ్మాయిలను పోలీసు స్టేషన్ సమీపంలోనే వదిలి వెళ్తున్నా..” పోలీలుసులు ఇదంతా కామన్ అని వ్యాఖ్యానిస్తున్నారు.. ఆడపిల్లలపై ఆఘాయిత్యం చేయడం కామనా..?” అని ప్రశ్నించారు.
ప్రభుత్వం స్పందించకపోతే సెంట్రల్ బలగాలు దిగుతాయి..
పాతబస్తీలో జరుగుతున్నదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న ఆయన.... సిటీలో ఇంత పెద్ద రాకెట్ నడుస్తుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. హిందూ రక్షక సంఘాలతో పాతబస్తీలో మార్చ్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే.. కేంద్ర బలగాలను రంగంలోకి దించుతామని అప్పుడు శాంతిభద్రతల సమస్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.