Ande Sri Jaya Jaya He Telangana Song Lyrics : పల్లె జానపదం... ప్రకృతి వనం... ఉద్యమ చైతన్యం అన్నీ కలగలిసేలా అందెశ్రీ కలం ఉంటుంది. ఆయన రాసిన రచనలు, పాటలు ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి. గొర్రెల కాపరిగా జీవనం సాగించిన అందెశ్రీ చదువు లేకుండానే గొప్ప రచయితగా గుర్తింపు సాధించారు. తాను చూసిన పల్లెలు, ప్రజల జీవితం, ప్రకృతితో మేమకమవుతూ అద్భుత రచనలు చేశారు. ఆయన కలం నుంచి జాలువారిన 'జయ జయహే తెలంగాణ' పాటకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం గుర్తింపు ఇచ్చింది. ఈ పాటకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు. ఆ రాష్ట్ర గీతం లిరిక్స్ మీకోసం...

Continues below advertisement

'జయ జయహే తెలంగాణ' లిరిక్స్

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం...

Continues below advertisement

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం...

తరతరాల చరిత గల తల్లీ నీరాజనం...

పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం....

జై తెలంగాణ జై జై తెలంగాణ...

జానపద జనజీవన జావళీలు జాలువార

కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర

అను నిత్యం నీగానం అమ్మనీవే మా ప్రాణం

జై తెలంగాణ జై జై తెలంగాణ...

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిన్ను తడుపంగా

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జై జై తెలంగాణ.

ఇలా ఎన్నో గొప్ప రచనలు చేసిన అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, సాహిత్య ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Also Read : ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత - సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి