Keerthy Suresh's Revolver Rita Release Date Locked : మహానటి కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్‌గా ఆమె నటించిన 'ఉప్పు కప్పురంబు' డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక లేటెస్ట్ అవెయిటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'రివాల్వర్ రీటా'. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ నెల 28న మూవీని రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వరల్డ్ వైడ్ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానున్నట్లు తెలిపింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయగా... కీర్తి సురేష్ గులాబీ చేతిలో పట్టుకుని నవ్వుతూ నిలబడగా... చుట్టూ ఉన్న రౌడీలు ఆమెకు గన్ గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది. లేడీ ఓరియెంటెడ్ ప్రాధాన్యం ఉన్న స్టోరీ అని తెలుస్తుండగా... లుక్స్‌ను బట్టి ఆమె ఓ లేడీ డాన్ పాత్ర పోషించనున్నారని అర్థమవుతోంది.
Also Read : కమల్ హాసన్‌తో రజనీ కాంత్ - వాట్ ఏ సీన్ తలైవా... కొత్త మూవీ షురూ
ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించగా... రాధికా శరత్ కుమార్, రెడిన్ కింగ్స్‌లీ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ & ది రూట్ బ్యానర్స్‌పై సుదన్ సుందరం, జగదీష్ పళని స్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులను హాస్య మూవీస్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
ఒకే రోజు 2 సినిమాలు
ఇదే రోజున ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అవెయిటెడ్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా' కూడా రిలీజ్ కానుంది. రామ్ ఓ హీరో అభిమానిగా కనిపించనుండగా... భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. 'రివాల్వర్ రీటా' కూడా అదే రోజున వస్తుండడంతో ఇద్దరికీ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం, కీర్తి సురేష్ విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్దన'లో నటిస్తున్నారు. రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలు కూడా పూర్తై ఈ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కింది. ఇక పవర్ ఫుల్ మాఫియా డాన్‌గా 'అక్క' సినిమా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్‌గా తెరకెక్కింది. త్వరలోనే ఇది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ థ్రిల్లర్ సినిమాలోనూ కీర్తినే హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మలయాళంలోనూ 'తొట్టం' సినిమా చేస్తున్నట్లు రీసెంట్‌గానే అనౌన్స్ చేసింది. ఇలా వరుసగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మూవీస్‌తో బిజీగా ఉన్నారు.