Pawan Kalyan's Ustaad Bhagat Singh First Single Update : రీసెంట్‌గా మెగా అభిమానులకు వరుస ట్రీట్స్ అందుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ నుంచి 'మీసాల పిల్ల' సాంగ్ ట్రెండ్ సృష్టించింది. ఇక రామ్ చరణ్ 'పెద్ది' నుంచి 'చికిరి చికిరి' సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 35 గంటల్లోనే 53 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వైపే ఉంది.

Continues below advertisement

పవన్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో అవెయిటెడ్ యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. స్టైలిష్‌గా వింటేజ్ పవన్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ ఫ్యాన్ దీనిపై మూవీ టీంను ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది.

ఎక్స్‌పెక్టేషన్స్ అలానే ఉంచు

Continues below advertisement

'మెగాస్టార్ 'మీసాల పిల్ల' సాంగ్ హిట్. రామ్ చరణ్ 'చికిరి చికిరి' సాంగ్ ప్రజెంట్ ట్రెండ్. నెక్స్ట్ మనమే ఉస్తాద్ భగత్ సింగ్.' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్యాగ్ చేశాడు. దీనికి రియాక్ట్ అయిన చిత్ర నిర్మాణ సంస్థ... 'ఆన్ ది జాబ్. ఎక్స్‌పెక్టేషన్స్ అలానే హైలో ఉంచండి' అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. వరుసగా మెగా హీరోల సినిమాల నుంచి పాటలో ట్రెండ్ అవుతున్నాయని ఇక మూవీస్ కూడా రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీకి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... త్వరలోనే 'ఉస్తాద్' నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తోంది.

Also Read : కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' వచ్చేస్తోంది - మహానటి కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

మూవీలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీ ఖన్నా కనిపించనున్నారు. అలాగే పార్తీబన్ విలన్ రోల్ చేస్తుండగా... కేఎస్ రవికుమార్, నవాబ్ షా, రాంకీ, కేజీఎఫ్ ఫేం అవినాష్, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు కంప్లీట్ కాగా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది సమ్మర్‌కు మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో పవన్, హరీష్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఎక్స్‌పెక్టేషన్స్ హై లెవల్‌లో ఉన్నాయి. ఈసారి ఫ్యాన్స్‌కు పూనకాలే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.