Telangana Bhavan: జనతా గ్యారేజీ సినిమాలో వివిధ సమస్యలు చెప్పుకోవడానికి జనతా గ్యారీజీని సంప్రదించినట్టుగానే ఇప్పుడు బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు హైడ్రా బాధితులు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. ప్రజా సమస్యలు వినేందుకు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌లో కీలక నేతలంతా ఆఫీస్‌లోనే ఉంటున్నారు. బాధితులు చెబుతున్న సమస్యలను వింటున్నారు. వాటిని నోట్ చేస్తున్నారు.
ఈ మధ్య హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ప్రజలతో మాట్లాడారు. వారి ఆవేదన తెలుసుకున్నారు. హైడ్రా కూల్చివేతలపై మండిపడ్డారు. ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి ఇళ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం పెద్దలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇలా హైడ్రా బాధితుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వివిధ మార్గాల్లో వారంతా బీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.
సోషల్ మీడియా, ఫోన్, మెయిలస్‌తోపాటు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయవచ్చని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పక్కా అనుమతులతోనే కట్టించుకున్న భవనాలను ఎలా కూలుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి వారికి బీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ భవన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వాళ్లు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని పిలుపునిచ్చారు.
కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతల పిలుపుతో హైడ్రా బాధితులంతా తెలంగాణ భవన్‌కు క్యూ కట్టారు. ఈ ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలంతా అక్కడకు చేరుకున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌రావు సహా ఇతర ముఖ్య నేతలంతా బాధితులతో మాట్లాడుతున్నారు. వారికి అండగా ఉంటామని చెబుతున్నారు. జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ రావడం లేదని బాధితులకు నేతలు వివరిస్తున్నారు. తనకు ఫీవర్ ఉన్న విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ పేరుతో నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా తమ ఇళ్లను కట్టడాలను కూల్చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మరోవైపు నుంచి ఆపరేషన్ మూసీ పేరుతో అధికారులు మార్కింగ్ చేస్తున్న విషయాన్ని నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఓవైపు నుంచి హైడ్రా, మరోవైపు ఆపరేషన్ మూసితో తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన తమలో ఉందని చెప్పుకున్నారు. రాత్రి పూట నిద్ర పట్టడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఇప్పుడు కట్టిన ఇళ్లకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని.. విద్యుత్ బిల్లులు కూడా అధికారులు వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. టాక్స్ కూడా కడుతున్నామని అన్నింటినీ తీసుకున్న తర్వాత అక్రమ కట్టడాలు ఎలా అవుతాయన్నారు. బాధితులు . బ్యాంకులు లోన్ కూడా ఇచ్చాయని వివరించారు. అధికారికంగా ఇన్న ఉన్నవాటిని అక్రమ కట్టడాలు అని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన