BRS MLC Kavitha Politics| బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీరు తెలంగాణ రాజకీయాల్లో రోజు రోజుకూ తీవ్ర ఉత్కంఠత రేపుతోంది. తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీకైన గంటల వ్యవధిలోనే చకచకా పరిణామాాలు మారిపోతున్నాయి. బీఆర్ ఎస్ లో జరుగుతున్న తప్పులపై తండ్రికి లేఖద్వారా తెలియజేసిన కవిత , ఆ లేఖ కాస్తా లీకవ్వడంతో ప్రత్యర్ది పార్టీల నుండి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. పార్టీలో విభేదాలు బయటపెట్టుకున్నట్లయ్యింది. కేటీఆర్ , హరీష్ రావు లతో గ్యాప్ వచ్చిందనే అనుమానాలకు బలం చేకూరింది. ఇంకేముంది అతి త్వరలో కవిత బీఆర్ ఎస్ కు బాయ్ బాయ్ చెప్పి ,కొత్త పార్టీ పెట్టేస్తారనే టాక్ షికార్లు కొడుతోంది.
BRS జెండా లేకుండా జాగ్రత్తగా..
అమెరికా పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టు వద్ద ఒక్కటంటే ఒక్క బిఆర్ఎస్ జెండా కూడా కనిపించలేదు. కవితకు స్వాగతం పలికే అభిమానుల్లో గులాబీ కండువా ధరించిన నాయకులు,కార్యకర్తలు కనుచూపుమేరలో లేరు. ఎయిర్ పోర్టు ప్రాంగణంలో కవితకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులు .. టీమ్ కవితక్క .. అనే ప్లెకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తు కనిపించారు. బిసీల ఆత్మబంధువు మా కవితక్క అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. సామాజిక తెలంగాణ అంటూ భారీ ప్లెక్సీ పట్టుకుని కవితకు స్వాగతం పలికారు.
పక్కా ప్లాన్ తో వెళ్తున్న కవిత
గతంలో ఎప్పుడూ లేని సీన్ చూస్తుంటే అతి త్వరలో కవిత బీఆర్ ఎస్ కు గుడ్ బాయ్ చెప్పేస్తారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. పార్టీలో ఉన్న అసంతృప్తిని తండ్రి కేసీఆర్ కు చెబుతూ రాసిన లేఖ , లీకైన కొద్ది గంటల్లోనూ ఇలా ఎయిర్ పోర్టు వద్ద కవిత టీమ్ హంగామా చేయడం చూస్తుంటే, పక్కా ప్లాన్ తో కవిత ముందుకు వెళుతున్నారనేది స్పష్టమవుతోంది.
తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం
లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో బెయిల్ పై జైలు నుండి విడులైన తరువాత నుండి కవిత తీరు మారింది. జిల్లాల పర్యటనలో బీఆర్ ఎస్ జెండాలు కనిపించడంలేదు. బీఆర్ ఎస్ క్యాడర్ తో అంటీ ముట్టనట్లుగానే ముందుకు దూసుకుపోతున్నారు. ఇటీవల బీఆర్ ఎస్ లో కొందరు తనను కావాలనే బదనాం చేస్తున్నారని , పనిగట్టుకుని సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసారు. ఇలా లేఖ కు ముందు జరిగిన పరిణామాలు , లేఖ తరువాత తాజాగా జరుగుతున్న సరికొత్త రంగులు చూస్తుంటే కవిత కొత్త దుకాణం పెట్టడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ
కొత్త పార్టీ పెడితే ఇప్పటికే అధ్యక్షురాలిగా ఉన్న తెలంగాణ జాగృతి పేరునే పార్టీ పేరుగా మార్చేస్తారా, లేక సామాజిక న్యాయం అంటూ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి సామాజిక న్యాయం కోసమే పుట్టిన పార్టీల మరో కొత్త పేరును తెరపైకి తెస్తారా అనేది వేచిచూడాలి. మొత్తానికి కవిత కారు దిగడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.