Padi Kaushik Reddy Grant Bail Latest News: బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని తిట్టిన కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు అయింది.  గురువారం ఉదయం నుంచి హైడ్రామా మధ్య ఆయన్ని అర్థరాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు. కౌశిక్‌తోపాటు ఇతర నాయకులను అరెస్టు చేయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన బీఆర్‌ఎస్ ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన నేపథ్యంలో చాలా మంది గులాబీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. 


ఫోన్ ట్యాపింగ్ అయిందని ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్‌లోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి... అక్కడ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో తమను కౌశిక్ బెదిరించారని సిబ్బంది కేసు పెట్టారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డిని గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఉదయానికల్లా ఆయన ఇంటిని పోలీసులు చుట్టు ముట్టారు.  


Also Read: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు


కౌశిక్ రెడ్డిని గురువారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు అర్థరాత్రి వరకు తిప్పుతూనే ఉన్నారు. ఎక్కడి తీసుకెళ్తున్నారో తెలియక బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తాని అర్థరాత్రి ఒంటిగంట సమయానికి కొత్తపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా అక్కడకు తరలి వచ్చారు. పార్టీ నేతలు వివేకానందరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్ రెడ్డి వంటి నేతలు కౌశిక్ రెడ్డి వద్దకు అర్థరాత్రి వచ్చారు. ఎందుకు అరెస్టు చేశారు. కారణం ఏంటని వివరాలు తెలుసుకున్న మెజిస్ట్రేట్‌ కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. 5వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్‌ ఇచ్చారు.  


కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారని ముందే తెలుసుకున్న హరీష్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఆయన ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారెవర్నీ పోలీసులు ఆ పరిసరాలకి కూడా వెళ్లనీయలేదు. వారిని కూడా అరెస్టు చేసి గచ్చిబౌలి స్టేషన్‌కు తరలించారు. ఇలా రోజుంతా హైడ్రామా నడిచింది. మొత్తానికి అందర్నీ అర్థరాత్రి వరకు స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు రాత్రి టైంలో విడిచిపెట్టారు. 


నాయకులను అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గమంటున్నాయి. ప్రజాపక్షాన ఉన్న నాయకులను అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఈ అరెస్టులకు నిరసనగా ఇవాళ(శుక్రవారం) ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అరెస్టులను ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నిరసన చేపట్టాలని నిర్ణయించింది.  


ట్యాంక్‌బండ్‌పై నిరసనలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. అటువైపుగా వచ్చే వాహనాలను తనిఖీ చేస్తోంది. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న నాయకులను హౌస్‌ అరెస్టులు చేసింది. కుత్బల్లాపూర్ ఎమ్మెల్యే వివేకనంద గౌడ్‌ను పోలీసులు ఇంటి నుంచి రానీయకుండా అడ్డుకున్నారు. యాక్టివ్‌గా ఉండే నాయకుల ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. 


Also Reddy: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు