Kavitha Letter: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్ కు తన కూతరు, ఆ పార్టీలో కీలక నాయకురాలు కవిత లేఖ రాయడంపై తెలంగాణ  రాజకీయాల్లో పెనుి దుమారం రేగుతోంది. కాంగ్రెస్, బిజెపి నేతలు విమర్శల కత్తులక పదును పెట్టి, లేఖ వెనుక జరుగుతోంది ఇదేనంటూ బీఆర్ ఎస్ ఇంటి గుట్టును రోడ్డున పెట్టే పనిలోపడ్డారు. ఆ పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా,  కవిత లేఖ ఎవరు రాయించారో మీకు తెలుసా అంటూ గాలి తగ్గిన కారుపై ఆకాష్ క్షిపణి ప్రయోగించినంత పనిచేస్తున్నారు. తాాజాగా బిజెపి ఎంపీ రఘనంద్ రావు సైతం కవిత రాసిన లేఖపై తనదైన శైలిలో స్పందిచారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత మరో షర్మిల కాబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు రఘనందన్. 

ఏపిలో షర్మిల విషయంలొో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కుటుంబంలో అన్న ,చెల్లెలి మధ్య తలెత్తిన మనస్పర్దలు చిలికిచిలికి తుపానుగా మారి, చివరకు పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టడం, ఆ తరువాత నెమ్మదిగా సమయం చూసి, కాంగ్రెస్ విలీనం చేయడం, కాంగ్రెస్ ఏపి పగ్గాలు తీసుకుని అన్నను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలా షర్మిల విషయంలో ఏదైతే ఏపిలో జరిగిందో, జరుగుతుందో .. అదే తెలంగాణా బిఆర్ ఎస్ లో జరగబోతోందని బిజెపి ఎంపీ రఘనందన్ అన్నారు.

కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఈనెల 2వ తేదిన  కేసీాాాఆర్‌కు రాసిన లేఖకు కారణాలు కుటుంబ పంచాయితీనా, ఆస్తుల పంచాయితీనా లేక రాజకీయ పంచాయితీనా తేలాల్సి ఉందని, అయితే ఈ లేఖ వెనుక తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు రఘనందన్ .లేఖ రాసిన రోజునే కాంగ్రెస్ పార్టీకి చెందిన టీవి ఛానెల్‌తో పాటు మరో పేపర్‌లో వార్తలు రావడం దీనికి మరింత బలం చేకూరుతోందని ఆరోపిస్తున్నారు. ఇటీవల బిఆర్ ఎస్ పార్టీ వరంగల్‌లో ఫ్లీనరీ నిర్వహించిన రోజు తన రాజకీయ వారసుడు కేటీఆర్ అంటూ కేసీాాాఆర్ చెప్పకనే చెప్పేయడం కవితకు ఆగ్రహాన్ని తెప్పించిందని, ఆ రోజు నుంచి కవిత కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారని రఘనందన్ ఆరోపిస్తున్నారు.  

సిఎం రేవంత్ రెడ్డి చెప్పడం వల్లనే కవిత లేఖ రాశారని, కర్త ,కర్మ,క్రియ రేవంత్ అనే అనుమానాలున్నాయంటున్నారు రఘనందన్. లేఖ రాసిన తరువాత ఆగమేఘాలపై కేటీాఆర్, హరీష్ రావు ఇంటికి వెళ్లడం, బావబామ్మర్దులు ఇద్దరం ఒక్కటే అనే సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే కవితను ఒంటరిని చేసి బయటకు పంపేందుకు ఫిక్స్ అయ్యారనే వాదనలకు బలపడుతున్నాయన్నారు. ఈ వ్యవహారంలో బిజెపిని లాగడం వెనుక రేవంత్ హస్తం ఉందన్నారు. బిజెపి ఎదుగుదలను తట్టుకోలేక బీఆర్ ఎస్ తో దోస్తే కడుతున్నామనే పుకార్లు పుట్టించేందుకు కవితను వాడుకున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదన్న రఘునందన్. త్వరలో కవిత కొత్త పార్టీ పెట్డం ఖాయమని, ఆ తరువాత కొన్నాళ్లు పార్టీ నడిపించి, వచ్చే ఎన్నికల ముందు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయబోతున్నారని రఘనందన్ కీలక వ్యాఖ్యలు చేశారు.