ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు విడుతల వారీగా చేపడుతున్న ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అడ్డుచెప్పడంపై న్యాయపోరాటం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. యాత్ర కంటిన్యూ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన ధర్మాసనం లంచ్ మోషన్ పిటిషన్ కు సాయంత్రం సమయం కేటాయించింది. 3.45 నిమిాలకు 5వ కోర్టులో వాదనలు వినేందుకు సిద్ధం అయింది.


బండి సంజయ్ గత కొంత కాలంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. తాత్కాలికంగా ఈ పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. మంగళ వారం బండి సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని.. కరీంనగర్‌లోని ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టారు. పాదయాత్రకు అనుమతి లేదని.. యాత్రకు రావొద్దంటూ గృహ నిర్బంధం చేశారు. 






బీజేపీ నాయకులు గాయపడ్డారని..


అయితే ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ నేతలు చేసిన నిరసనలో పలువురు బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిందని... అందుకు నిరసనగా బండి సంజయ్ దీక్ష చేయబోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్మ దీక్షకు అనుమతి లేదనే కారణంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకన్నారు. అరగంట సేపు జనగామలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్ ను కరీంనగర్ తీస్కొని ఆయన ఇంట్లోనే నిర్బంధించారు. దీనిపై బీజేపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే న్యాయ పోరాటం చేసేందుకు బండి సంజయ్ సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే తాను చేస్తున్న ప్రజా సంగ్రాయ యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు.   


తీవ్రంగా ఖండించిన బీజేపీ జాతీయ నాయకులు..


బండి సంజయ్ గృహ నిర్బంధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్ఛార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ యాత్రను ఆపారో అక్కడే మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించారు. యాత్రను అడ్డుకొని సీఎం కేసీఆర్ తప్పు చేశారని వ్యాఖ్యానించారు. 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ జరుపుతానన స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని వివరించారు. 


గవర్నర్ కు ఫిర్యాదు.


ఢిల్లీ లిక్కర్ స్పాం ఆరోపణలను డైవర్ట్ చేసేందుకే బండి సంజయ్ యాత్రను అడ్డుకున్నా బేజీపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. కావాలనే టీఆర్ఎస్ నాయకలు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని అన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. పాదయాత్రను కొనసాగించేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు వినతి పత్రం అందజేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని..   పాదయాత్ర వ్యవహారాలను చూస్తున్న జి.మనోహర్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ ప్రకటించారు.  పోలీసుల అనుమతితోనే గత మూడు విడతలుగా పాదయాత్ర కొనసాగిస్తున్నామని స్ఫష్టం చేశారు.