Bandi Sanjay : కృష్ణా జలాల విషయంలో చంద్రబాబుతో కుమ్మక్కై తెలంగాణకు కేసీఆర్ ద్రోహం చేశారని ఆరోపించారు. ఆయన నుంచి ముడుపులు అందుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌కు సానుభూతి రావాలని చెప్పి భూతులు తిడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష బాగాలేదని అంటున్నారు. మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడిన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
కోస్గీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణలో దుమరాన్ని రేపుతున్నాయి. ఆయన కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని అన్ని పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బండి సంజయ్ మాట్లాడుత... రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని అన్నారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి భాష మాట్లాడి వ్యతిరేకత తెచ్చుకున్నారని అన్నారు. అప్పట్లో కూడా ఆయన భాషపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా భాషను సరి చేసుకోవాలని సూచించారు.
కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు బండి సంజయ్. తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని కేసీఆర్ వల్లే అన్నారు. చంద్రబాబుతో కలిసి తీరని ద్రోహం చేశారని అన్నారు. 570 టీఎంసీలు రావాల్సి ఉంటే 299 టీఎంసీలకే అంగీకరించి గొంతుకోశారని అన్నారు. దీని కోసం చంద్రబాబు నుంచి ముడుపు తీసుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేయడానికి కృష్ణా జలాలను ఎంచుకున్నారని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. దీంతో నేతలంతా తీవ్ర నిరాశలో ఉన్నారని అన్నారు. పడిపోతున్న తన పార్టీని, బీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారని అన్నారు. దీని వల్ల కేసీఆర్‌కు సానుభూతి వస్తుందని అన్నారు. అందుకే రెండు పార్టీలు కుమ్మక్కై ఇలాంటి నాటకాలు ఆడుతున్నాయని అన్నారు.