Ram Mandir Inauguration: అయోధ్యలో రామ్ లల్లా (Ram Lalla ) ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సవాని సంబంధించిన క్రతువులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. 22న జరిగే ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమం నిర్వహణ మొత్తం లక్ష్మీకాంత్ దీక్షితులు (Laxmi Dixithulu) నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను అయోధ్య ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అట్టహాసంగా జరగబోయే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి అన్నిరంగాల ప్రముఖులు హాజరుకానున్నారు.  22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ముహూర్తం ఉంది. ఈ 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ దివ్యమైన.. మంగళమైన ముహూర్తం అని భక్తులు భావిస్తున్నారు. 


ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే...
22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. ఆహ్వానపత్రిక రావడంతో అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సైతం అయోధ్య ట్రస్టు ఆహ్వానించింది. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ దంపతులు, ప్రభాస్, అల్లు అర్జున్, దర్శక ధీరుడు, రాజమౌళికి ఆహ్వానం అందింది. భారత్ బయోటెక్ అధినేతలు క్రిష్ణఎల్లా, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్, యశోద హాస్పిటల్స్ ఛైర్మన్ దేవేందర్ రావు ఆహ్వానాలు అందాయి. బ్యాడ్మింట్ కోచ్ పుల్లెల గోపిచంద్, మాజీ క్రికెటర్ పూర్ణిమా రావు, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, చినజీయర్ స్వామికి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం పంపింది.  


అమితాబ్ బచ్చన్ నుంచి రజనీకాంత్ దాకా...
దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, ఇళయరాజా, మోహన్ లాల్, ధనుష్, కాంతారా స్టార్ రిషబ్ శెట్టి, ప్రొడ్యూసర్ మహావీర్ జైన్ లకు అయోధ్య ఆహ్వానం అందించారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, కంగనా రనౌత్, శ్రేయా ఘోషల్, సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, ఆలియా భట్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, మధుర్ భండార్కర్, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్, అనురాధ పడ్వాల్, శంకర్ మహదేవన్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.  దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానం పంపింది. 


జాబితాలో ఆ ఐదుగురు జడ్జీలు కూడా...
రామ మందిరంపై చారిత్రాత్మక తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిలను ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించారు. 2019లో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా ఐదుగురు జడ్జీలు తీర్పు ఇచ్చారు. అందులో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, మాజీ సీజేఐ, ఎంపీ  రంజన్ గొగోయ్,  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూరి, ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నాజీర్, అశోక్ భూషణ్ ఉన్నారు.  


Also Read 



అయోధ్య రిలేటెడ్‌ స్టోరీలు





  • పరస్త్రీ నీడ కూడా సోకనివ్వక పోవడం అంటే ఇదే - అందుకే రాముడు ఏకపత్నీవ్రతుడు!

  • 'జై శ్రీరామ్'ను మీ కాలర్ ట్యూన్‌గా మార్చడం ఎలా?

  • అయోధ్య బాలరాముడి నిజరూప దర్శనం

  • థియేటర్లలో అయోధ్య రాముని పండుగ లైవ్‌

  • అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌?