తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఒకట్రెండు రోజలు వర్షాలు పడేఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు ప్రాంతాల్లో పడొచ్చనని అంచనా వేస్తోంది. దక్షిణ, తూర్పు తెలంగాణలో జిల్లాలోని ప్రాంతాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది. 


తమిళనాడు నుంచి వస్తున్న తేమ గాలుల వల్ల రాయలసీమలోని పలు భాగాలు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం పరిసర ప్రాంతాలు, తిరుపతి నగరంలోని దక్షిణ భాగాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి నగరంలో వాతావరణం చల్లగా చినుకులు పడుతూ ఉండనుంది. భారీ వర్షాలు అయితే ఉండవు.


కొన్నిప్రాంతాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని తెలుస్తోంది. సముద్రపు గాలులు పెరగడం వల్ల కోస్తా ప్రాంతాల్లో కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా దాక 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతోంది. ఒక్క పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాలోని పలు భాగాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతాయి.
విశాఖ​, తిరుపతి, కాకినాడ​, రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ​, మచిలీపట్నం, విజయనగరంలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 మధ్యలో నమోదయ్యే ఛాన్స్ ఉంది. కడప​, అనంతపురం, కర్నూలు నగరాల్లో 41 డిగ్రీల దగ్గర్లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 






అకాల వర్షాల సీజన్ ఏప్రిల్ 17 నుంచి మొదలుకానుంది. మొదట 17 నుంచి 20 దాక అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు), విజయనగరం, పార్వతీపురం మణ్యం జిల్లాతోపాటుగా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే అకాల వర్షాలుంటాయి, శ్రీ సత్యసాయి జిల్లా (పుట్టపర్తి), అనంతపురం, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా (మదనపల్లి సైడ్) కొన్ని వర్షాలుంటాయి.
ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ రాష్ట్రం దక్షిణ భాగాల్లో వర్షాలు పెరుగుతాయి. అక్కడక్కడ నుంచి అకాల వర్షాల సిజన్ పుంజుకుంటుంది. విశాఖ​, కాకినాడ​, తిరుపతి, గుంటూరు, ఎన్.టీ.ఆర్ జిల్లా (విజయవాడ​), ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడ కొన్ని వర్షాలుంటాయి. అలాగే కడప​, నంధ్యాల​, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా (మచిలీపట్నం) జిల్లాల్లో కూడ కొన్ని వర్షాలుంటాయి.