Hyderabad Police Vs Andhra Pradesh Police: హైదరాబాద్‌లో ఇద్దరు ఏపీ కానిస్టేబుళ్లను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి యత్నిస్తున్న టైంలో పట్టుకొని అరెస్టు చేశారు. AP39 QH 1769 MARUTHI ECO వాహనంతో వారిని పట్టుకున్నారు. ఆ వెహికల్‌లో 22 కేజీల గంజాయి 11 పాకెట్స్‌లో దొరికిందని తెలిపారు పోలీసులు.
ఆ వాహనంలో ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తే... కాకినాడలోని 3rd బెటాలియన్ APSP చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తేలింది. వీళ్లిద్దరు గంజాయి స్మగ్లింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో ఈ పని చేసినట్టు విచారణలో బయటపడింది.
ఆరోగ్యం బాగాలేదనే మిషతో సెలవు పెట్టి మొదటిసారిగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం ఈ కేసు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుగుతుంది.