Crime News :   హైదరాబాద్ శివారులోని సెలబ్రిటి క్లబ్‌లో జరిగిన కాల్పుల వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో కాల్పులు జరిపిన వ్యక్తిగా పోలీసులు సైతం చెప్పిన కార్తీకదీపం సరియల్ యాక్టర్ మనోజ్  తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అసలు కాల్పులు జరపలేదని ఇంకా చెప్పాలంటే తాను అసలు హైదరాబాద్‌లోనే లేనని.. బెంగళూరులో ఉన్నానని ఆయన ఇన్ స్టా లో ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది.  






 


శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్ విల్లాలో ఎయిర్ గన్‌తో తనపై మనోజ్ కాల్పులు జరిపాడంటూ సిద్ధార్థ దాస్ అనే వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించడంతో కథ ప్రారంభమయింది. ఈ స్టోరీ అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. నిజంగానే మనోజ్ కాల్పులు జరిపారని అనుకున్నారు. ఈ మనోజ్ యాక్టర్ కావడంతో  ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత పెరిగింది.  యాక్టర్ మనోజ్.. స్మిత గ్రంథి అనే మహిళతో సహజీవనం చేస్తున్నారు. సెలబ్రిటీ క్లబ్ విల్లాలో నివాసం ఉంటున్నారు. 


స్మితా గ్రంధికి మొదటి భర్త ద్వారా  ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త   సిద్దార్థ్ దాస్.  భర్తతో విడిపోయిన స్మిత గ్రంథి.. టీవీ యాక్టర్‌ మనోజ్‌తో సహజీవనం చేస్తున్నాురు.  సిద్ధార్థ్‌, స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా.. పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్‌ న్యాయ పోరాటం చేస్తున్నాడు. పిల్లలపై మనోజ్‌ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోజ్‌పై స్మిత, సిద్ధార్థల  కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్‌ చిత్రహింసలు పెట్టాడని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కూకట్‌పల్లిలోని ఫిడ్జ్‌ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా, కుమార్తె శామీర్‌పేటలోని శాంతినికేతన్‌ రెడిసెన్షియల్‌ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సంరక్షణలో ఉన్నారు.                           
 
ఈ క్రమంలో తాను పిల్లల కోసం   విశాఖ నుంచి హైదరాబాద్‌ వచ్చానని .. సెలబ్రిటీ క్లబ్‌లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్నని . ఈ క్రమంలో సిద్ధార్థ్‌ను చూసి ఆగ్రహించిన సీరియల్‌ నటుడు మనోజ్‌.. ఎయిర్‌ గన్‌తో  కాల్పులు జరిపాడని .. సిద్ధార్థ దాస్ ఫిర్యాదు  చేశాడు.  కానీ ఇప్పుడు మనోజ్ తాను బెంగళూరులో ఉన్నానని వీడియో రిలీజ్ చేయడంతో..అసలు కాల్పులు ఎవరి జరిపారన్నది కీలకంగా మారింది. మాజీ భర్తపై స్మితా గ్రంథినే కాల్పులు జరిపారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.