HYDRA demolitions | హైదరాబాద్: కబ్జాకు గురైన చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లోని భూములను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. ఇందులో భాగంగా హైడ్రా అనే వ్యవస్థను గత నెలలో తీసుకొచ్చింది. హైడ్రా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అని చూడకుండా చట్ట ప్రకారం కూల్చివేతలు కొనసాగిస్తోంది. హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆఫీసులను కూడా కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. 


 జీహెచ్ఏంసీ ప్రధాన కార్యాలయం వద్ద నీటి కుంట ఉండేది దాన్ని కూల్చేస్తారా? నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కూల్చేస్తారా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సీసీఎంబి ఆఫీస్ హిమాయత్ సాగర్ వద్ద ఉంది, దాన్ని కూడా కూల్చేస్తారా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌తో పాటు కావేరి సీడ్స్‌ యజమాని భాస్కర్‌రావు, ప్రొ కబడ్డీ లీగ్‌ ఓనర్‌ అనుపమలతో పాటు పలువురి భవనాలను సైతం హైడ్రా కూల్చివేసింది.


హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. గోల్కొండలోని చెరువులో ఉన్న గోల్ఫ్ కోర్టులో  ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారని చెప్పారు. ఎల్‌టీఎఫ్‌ సమస్యపై నగర మేయర్‌ను కలిసి మాట్లాడామని, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అన్నారు. ముస్లింల వక్ఫ్‌ బోర్డుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుండటాన్ని వ్యతిరేకించారు.  ముస్లింలను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. 


Also Read: Nagarjuna: ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు, కోర్టు తీర్పును గౌరవిస్తా: నాగార్జున