టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ నోటీసులు అందుకున్న బండి సంజయ్ అనుచరుడు, అడ్వకేట్‌ శ్రీనివాస్‌ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ని అధికారులు విచారిస్తున్నారు. ఆనయతోపాటు ఈ కేసులో నోటీసులు అందుకున్న మరో ముగ్గురు విచారణకు వస్తారా రారా అనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు జేడీజేఎస్ పార్టీ అధ్యక్షుడు తుషార్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుజీస్వామికి సిట్‌ నోటీసులు అందించింది. నేడు(21నవంబర్‌ 2022) విచారణకు రావాలని లేకుంటే అరెస్టు చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించింది. 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. నోటీసులు అందుకున్న వారిలో ఒక్క శ్రీనివాస్ తప్ప వేరెవ్వరూ స్పందించలేదు. దీంతో తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. 

బండి సంజయ్ అనుచరుడిగా ఉన్న కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్... ఎమ్మెల్యే కొనుగోలు డీల్‌కు వచ్చిన వారికి విమాన టికెట్లు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు ఆయన్నే అడిగి సిట్ అధికారులు తెలుసుకోనున్నారు. టికెట్లు ఎవరు చేయమన్నారు... దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరనే కోణంలో విచారణ సాగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో శ్రీనివాస్‌ను అధికారులు విచారిస్తున్నారు.  

మిగతా ముగ్గురిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు ఎలాంటి నోటీసులు అందలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే నెంబర్‌ ఉన్న సిమ్‌కార్డులు తీసుకురావాలని ఇద్దరికి ఇచ్చిన నోటీసుల్లో సిట్ అధికారులు చెప్పడం అప్పట్లో తీవ్ర విమర్శల పాలైంది. తర్వాత దాన్ని సరి చేసి మరోసారి పోలీసులు నోటీస్‌ ఇచ్చారు. అదే తమకు అందలేదని సంతోష్ అనుచరులు చెబుతున్నారు. 

సిట్‌ విచారణ నోటీసులు అందుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించిన ప్రయోజనం లేకపోయింది. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఫామ్ హౌస్ కేసులో బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులపై బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదని హైకోర్టు సూచించింది. ఢిల్లీలో ఓ వ్యక్తికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని హైకోర్టుకు తెలపగా.. కేసు దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశించాలని సిట్ కోరింది. తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.