Actress Sreeleela as brand ambassador for Sri Chaitanya: హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ చొప్పున ఓ ప్రకటనలో తెలిపారు. విద్యారంగంలో ఎన్నో సంచలన విజయాలు నమోదు చేస్తూ జాతీయ స్థాయి పోటీ పరీక్షలయిన ఐఐటీ- జేఈఈ, నీట్ (NEET) లలో గతేడాది 3 నంబర్ వన్ ర్యాంకులు సాధించింది శ్రీచైతన్య. అలాంటి శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ శ్రీలీల ను నియమించడం ద్వారా మరో ముందడుగు వేసిందన్నారు. శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరించడంతో తమ విద్యాసంస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని అన్నారు.
39 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీచైతన్య విద్యాసంస్థలు, విద్యారంగంలో విప్లవాత్మక బోధనా పద్ధతులు అవలంభించిందన్నారు. తాము ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశానికి అందించామని తెలిపారు. ఐఐటీ-జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అనేక అత్యున్నత ర్యాంకులు శ్రీ చైతన్య సాధించింది అన్నారు. టాప్ క్లాస్ టీచింగ్ టీమ్ పర్యవేక్షణలో విద్యార్థులకు ఒత్తిడిలేని విద్యతోపాటు, పోటీ పరీక్షలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధమైన బోధన ప్రవేశపెట్టామన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రతిభతో ఎన్నో రంగాలలో సేవలను అందిస్తున్న వారిలో శ్రీచైతన్య విద్యార్థులు ఉండడం తమకు గర్వకారణం అన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థలు మరిన్ని కొత్తమైలురాళ్ళు అధిగమించేందుకు శ్రీలీల ఒక కీలక పాత్ర పోషిస్తుందని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ విశ్వాసం వ్యక్తం చేశారు.
శ్రీచైతన్య అంటే విద్యారంగంలో ఒక అద్వితీయమైన శక్తి అని, విద్యార్థులను విజయ తీరాలకు చేర్చే దిక్సూచి శ్రీచైతన్య అని హీరోయిన్ శ్రీలీల కొనియాడారు. శ్రీచైతన్య విద్యా సంస్థలను ఎంచుకోవడంతోనే వారి విజయం ఖాయమని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకొని వారి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీచైతన్య విద్యా సంస్థల యాజమాన్యం తనను బ్రాండ్ అంబాసిడర్ ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.