Actor Vijay Devarakonda Stucked In Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad Airport) శుక్రవారం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమానంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సహా పలువురు సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు.


కాగా, విజయ్ తన తల్లితో కలిసి యూపీ ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఇంతలోనే విమానం సాంకేతిక లోపంతో ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. ఫ్లైట్ ఆలస్యం కావడంపై విజయ్ సహా ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య తలెత్తితే ముందస్తు సమాచారం ఇవ్వాలని కనీసం సమాచారం లేకుండా ఇలా గంటల తరబడి వెయిట్ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ అని చెప్పి ఒక టికెట్‌కి రూ.30,000 తీసుకుంటున్నా ఇంత ఆలస్యం ఏంటని నిలదీస్తున్నారు. సుమారు 5 గంటలకు పైగా విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.


Also Read: Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..