Telangana State RTC: కేవలం రూ.99లకే విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ప్రయాణం

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలోకి కొత్తగా మరిన్ని అద్దె ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ప్రచారం నిమిత్తం విజయవాడ- హైదరాబాద్‌ మధ్య కేవలం రూ.99 ఛార్జి వసూలు

Continues below advertisement
EV Vehicles Between Hyderabad And Vijayawada : విజయవాడ- హైదరాబాద్‌ మధ్య ప్రయాణికులకు లక్కీ ఛాన్స్‌....కేవలం రూ.99లకే విజయవాడ నుంచి హైదారాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణించే అవకాశం. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంలో  భాగంగా తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున ఎలక్ర్టిక్  వాహనాలకు పచ్చజెండా ఊపింది. దీనిలో భాగంగా ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త విద్యుత్ బస్సును అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే  ఈ బస్సు విజయవాడ- హైదరాబాద్ మార్గంలో పరుగులు పెట్టనుంది
 
విజయవాడ- హైదరాబాద్ ఛార్జి రూ.99
విద్యుత్ వాహనాల(Electric Vehicle)కు ప్రచారం కల్పించే ఉద్దేశంతో  హైదరాబాద్‌(Hyderabada)-విజయవాడ (Vijayawada), విజయవాడ- హైదరాబాద్‌ మధ్య ఛార్జిని కేవలం రూ.99కే అందిస్తున్నట్లు ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య తెలిపారు. ఈటీవో(ETO) మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్ బస్సును రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈనెలలోనే హైదారాబాద్‌- విజయవాడ మధ్య ఈవీ(EV) బస్సులు నడిపేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు ఈటీవో మోటార్స్‌ ఎండీ రాజీవ్‌, ఫ్లిక్‌ బస్ ఇండియా ఎండీ సూర్య తెలిపారు. ఆ తర్వాత విజయవాడ(Vijayawada)- విశాఖ(Vizag) మధ్య సైతం ఈ సర్వీసులు నడపనున్నట్లు వారు వివరించారు. సర్వీసులు ప్రారంభమైన తర్వాత నెలరోజుల పాటు  విజయవాడ- హైదరాబాద్ మధ్య నెలరోజుల పాటు కేవలం రూ.99 ఛార్జీ వసూలు చేయనున్నట్లు తెలిపారు. సాధారణ బస్సులకు ఈవీ మధ్య సామర్థ్యం విషయంలో ఏమాత్రం తేడా ఉండదని...కేవలం 5 గంటల్లోనే  హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకోవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలూ ఈ బస్సుల్లో వర్తిస్తాయని వారు తెలిపారు. ప్రస్తుతానికి  49 సీట్ల సామర్థ్యం ఉన్న బస్సులను  తీసుకొచ్చామని....త్వరలోనే  స్లీపర్‌ కోచ్‌లతో బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు.
 
చౌక రవాణా
సాధారణ పెట్రోలు,డీజీల్ వాహనాలతో  పోల్చితే  విద్యుత్ వాహనాల్లో(EV) రవాణా చాలా చౌక. పైగా పర్యావరణహితం కావడంతో  పెద్దఎత్తున వాహనాదారులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే  ద్విచక్రవాహనాల మార్కెట్‌పై పట్టుబిగించిన ఈవీ....మెల్లమెల్లగా  కార్ల మార్కెట్‌ను హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలన్నీ ఈవీ బైక్‌లు, కార్లు తీసుకొస్తున్నాయి. ధరలు కాస్త అధికంగా ఉన్నప్పటికీ  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ రాయితీలతో  అందరూ వీటి వైపే మొగ్గు చూపుతున్నారు.  ఒక్క ఛార్జింగ్ చేస్తే దాదాపు 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే కార్లు అందుబాటులోకి వచ్చాయి. సరకు రవాణారంగంలోనూ ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రవేశించాయి.ఇప్పటికే ఈఆటోలు సేవలు అందిస్తుండగా...హెవీ వెహికల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. అలాగే బస్సులు సైతం వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ ఒకడుగు ముందుకు వేసి ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీ ప్రెష్‌ బస్‌ పేరిట హైదరాబాద్‌-విజయవాడ మధ్యలో సర్వీసులు ప్రారంభించింది. ధరలు తక్కువగా ఉండటంతో పాటు...సౌకర్యవంతమైన ప్రయాణం ఉండటంతో ప్రయాణికులు పెద్దఎత్తున వీటికి ఆకర్షితులవుతున్నారు. అలాగే రద్దీని బట్టి టిక్కెట్ ధరలను సైతం తగ్గించడం  కలిసొచ్చే అంశం.ఇక ఫ్లిక్‌ బస్సులు సైతం అందుబాటులోకి వస్తే...ప్రయాణికులకు  సుఖవంతమైన ప్రయాణ అనుభూతి కలిగే అవకాశం ఉంది. మరో మూడు, నాలుగు వారాల్లో కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి

Also Read: లక్షన్నర ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 500కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఓ రేంజ్ ఆఫర్ ఇది.

Continues below advertisement