Andhra Pradesh And Telangana: ఈ మధ్య కాలంలో ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. తండ్రి ఇంట్లోకి రాగానే ఓ చిన్నారి పరిగెత్తుకొని వెళ్తుంది. పాపను చూడగానే ఆ తండ్రి బెల్ట్ తీస్తాడు. కొడతాడేమో అనుకుంటారంతా... కానీ ఆ బెల్ట్‌ను ఆమెకు ఊయలలా చేసి ఊపుతాడు. అయితే దీనిపై ఓ యూట్యూబర్‌ జోక్స్ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నే తప్పుబడుతూ నటుడు సాయి ధరమ్ తేజ్‌ తెలుగు ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. వాళ్లు కూడా స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. 





ఇది చాలా భయంకరమైంది. చాలా అసహ్యకరమైంది కూడా. ఫన్ పేరుతో సోషల్ మీడియా మీద ఇలాంటి చర్యలు సహించరాని నేరం. ఇలాంటి రాక్షసులను గుర్తించి శిక్షించాలన రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డిప్యూటీ సీఎంలు పవన్ కల్యాణ్, మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నారా లోకేష్‌కి ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. 



 


సాయి ధరమ్ తేజ్‌ ఫిర్యాదుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ స్పందించింది. ఇలాంటివి తమ దృష్టికి తీసుకొచ్చినందుకు థాంక్స్ చెప్పారు. చిన్నారుల భద్రత తమకు చాలా ముఖ్యమని దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా మాట ఇచ్చారు . 




ఫిర్యాదు అందుకున్న వెంటనే ఈ ఘటనపై కేసు రిజిస్టర్ చేశామంది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు చేశామని విచారణ ప్రారంభించామన్నారు. నిందితుడిని పట్టుకొని కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. 







ఈ ఘటనపై సాయిధరమ్‌ తేజ్ స్పందించడం ... ఆయన ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అవ్వడంపై నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి కూడా సాయిధరమ్‌ తేజ్ సమాధానం చెప్పారు. "జరిగిన ఘటనను చిన్నగా చేసేందుకు వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని అయితే ఆ హక్కు విచక్షణారహితంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే స్వేచ్ఛను ఇవ్వదు. హక్కులతోపాటు బాధ్యతలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇంగితజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. 







నా వాక్ స్వాతంత్ర్యం పిల్లలకి, వారి తల్లిదండ్రులను గాయపరుస్తుందంటే...  ఆ స్వేచ్ఛను వదులుకుంటాను. అటువంటి బాధను కలిగించే హక్కును సమర్థించడం కంటే నా హక్కును వదిలేస్తాను. మాట్లాడే స్వేచ్ఛ ఒక యువకుడి మానసిక ప్రశాంతతకు ముప్పు కలిగిస్తే దానికున్న విలువేంటీ? అలాంటి సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉంటా. తల్లిదండ్రుల వేదన అర్థం చేసుకోగలరా? ఇది తండ్రికి కలిగించే బాధను మీరు అర్థం అవుతుందా? ఆ బాధను మీరు భరిస్తారా?" అని ప్రశ్నించారు. మానవ హక్కులను రక్షించే వ్యక్తి వేషధారణను విడిచిపెట్టి మంచి చేసే వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు.