KTR Comments At ABP Southern Rising Summit 2024: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లై డిటెక్టర్ టెస్టు చేయాలంటూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రానికి "విపత్తు" లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని కామెంట్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు.


కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు పట్టించుకోవడం లేదని ‘ఆయా రామ్‌ గయారామ్‌’ సంస్కృతికి పాల్పడుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి విపత్తులా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాయన్నవారు. వారు 100 రోజుల్లో మేజిక్ చేస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. 300 రోజులు గడిచాయని...ఏమి జరిగిందో అంతా చూస్తున్నామని వాళ్లు కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వాగ్దానాలు హాఫ్‌ గ్యారంటీ అయిపోయాయని ఎద్దేవా చేశారు. ఆరు హామీలు సగానికిపైగా కోతపెట్టారని విమర్శించారు. 


ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు కేటీఆర్. ఈ ప్రభుత్వం సొంత మంత్రుల ఫోన్‌లను ట్యాప్ చేయలేదా? అని రేవంత్‌ను అడుగుతున్నాను. దీనిపై సూటిగా సమాధానం చెప్పమనండి. అధికార ప్రభుత్వంలోని, ప్రతిపక్షంలోని ఎవరెవరు ఫోన్‌లు రేవంత్ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుందో తెలుసు. ఈ విషయంపై ఆయనకి కూడా క్లారిటీ ఉంది. మా ప్రభుత్వం మూడేళ్ల తర్వాత తిరిగి వస్తుంది; తప్పకుండా రేవంత్‌ను వెంటాడతాం. " అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 


రేవంత్‌ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమవ్వాలని సూచించారు. “రేవంత్ రెడ్డిని అడగండి... లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోమని; నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సవాల్ తీసుకోమని ఆయనకు చెప్పండి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తోంది.


మునుపటి అసెంబ్లీ ఎన్నికల్లో BRS పనితీరుపై కేటీఆర్‌ మాట్లాడుతూ...14 సీట్లను వెనకబడ్డట్టు అంగీకరించారు. అయితే ఇది "కొత్త విషయాలు " నేర్చుకునే అనుభవం. "ఏ ప్రభుత్వమైనా 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ప్రజలకు ఓ విధమైన నిరాశ వచ్చేస్తుంది." ఇవే ఓటమికి కారణమైంది. తొమ్మిదేళ్లలో 1.60 లక్షల ఉద్యోగాలు సృష్టించడం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను 73% పెంచడం వంటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలుగా హైలైట్ చేశారు. అయితే ఈ విజయాలు యువతకు తెలియజేయలేక వారి మద్దతుు కోల్పోయామని అంగీకరించాడు.


కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాన్ని కేటీఆర్ ప్రశంసిస్తూ "నేను క్రెడిట్ ఇవ్వాలి, కాంగ్రెస్ ఆరు హామీలతో చేసిన ఊహాత్మక ఎన్నికల ప్రచారం బాగా పని చేసింది. అప్పటికే మా ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నందున ప్రజలు కాంగ్రెస్ నుంచి మరింత ఆశించారు.


ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొత్త పాత్రపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేసారు...“మాకు రెండు పర్యాయాలు అధికారం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. … నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించే పాత్ర ఇప్పుడు ఇచ్చారు. జవాబుదారీగా ఉండండి, ప్రభుత్వం తప్పులు చేయకుండా చూసుకోండి, వారు చేసిన వాగ్దానాలను నెరవేర్చేలా చూసుకోండి. ఇది గొప్ప పాత్ర.."


కేసీఆర్ కుటుంబంపై దురహంకార ఆరోపణలు ప్రస్తావిస్తూ, “మీకు ఆత్మస్థైర్యం ఉంటే, మీరు ఆత్మవిశ్వాసం, అహంకారం రావచ్చు. ముఖ్యమంత్రి కొడుకు అయిన నాలాంటి వ్యక్తి మంత్రిగా బాగా పనిచేస్తున్నప్పుడు.. దెబ్బతీయడానికి అహంకారం, అవినీతి వంటి ఆరోపణలు చేశారు.


ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల ద్వారా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీని కేటీఆర్ విమర్శించారు. "రాజకీయ నాయకులపై తనిఖీలు ఇప్పుడు భారతదేశంలో ఒక ఫ్యాషన్‌గా మారింది, వారి పక్షాన ఉన్నవారు సురక్షితంగా ఉంటున్నారు. ఈడి వారి జోలికి పోదు. కానీ ఎవరైనా బిజెపితో లేకుంటే వెంటే వచ్చేస్తున్నారు" అని ఆయన విమర్శించారు. 


కాంగ్రెస్ వాగ్దానాలపై విరుచుకుపడిన కేటీఆర్, “కాంగ్రెస్ వారి ఆరు హామీలు ఎక్కడ అమలు అయ్యాయి. 100 రోజుల్లో అందజేస్తామని వాగ్దానం చేశారు. అందుకే కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు తమ తప్పులను ఇప్పటికే గ్రహించారని నేను భావిస్తున్నాను. మాకు మరొక అవకాశం ఇస్తారు. ”


బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్ష నాయకులను చేర్చుకున్నారనే ఆరోపణలపై కేటీఆర్‌ ఇలా వ్యాఖ్యానించారు, “మేము చేసింది రాజ్యాంగబద్ధం. విలీనానికి రాజ్యాంగమే అనుమతించింది. ఒక పార్టీలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు ఏకీభవిస్తే, అది విలీనంగా పరిగణిస్తారు. ఒక పార్టీకి చెందిన పది మంది మాత్రమే పార్టీ మారితే దానిని ఫిరాయింపు అని అంటారు. ఇది ఫిరాయింపు నిరోధక చట్టాలు చెప్పిన విషయమే"