Trains Cancelled: సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్ల పరిధిలో వారం రోజుల పాటు పలు రైల్లు రద్దయ్యాయి. నిర్వహణ పనుల కారణంగా రెండు డివిజన్లలో  పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్ల రాకపోకలను పాక్షికంగా నిలిపివేసింది. రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా.. మొత్తం 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజుల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తెలిపింది.  


ఈ నెల 14 నుంచి 20 వరకు ఇందులో 18 రైళ్లు, 15 నుంచి 21 వరకు రెండు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ సందర్భంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.  రద్దయిన వాటిలో కాజీపేట- డోర్నకల్‌ (07753), డోర్నకల్‌- కాజీపేట (07754), డోర్నకల్‌- విజయవాడ (07755), విజయవాడ- డోర్నకల్‌ (07756), భద్రాచలం రోడ్‌- విజయవాడ (07278), విజయవాడ- భద్రాచలం రోడ్‌ (07979) ఉన్నాయి.


అలాగే కాజీపేట- సిర్పూర్‌టౌన్‌ (17003), బల్లార్షా- కాజీపేట(17004), సిర్పూర్‌టౌన్‌- భద్రాచలం రోడ్‌ (17034), సికింద్రాబాద్‌- వరంగల్‌ (07462), వరంగల్‌- హైదరాబాద్‌ (07463), సిర్పూర్‌టౌన్‌- కరీంనగర్‌ (07766), కరీంనగర్‌- నిజామాబాద్‌ (07893), కాజీపేట - బల్లార్షా (17035), కాచిగూడ- నిజామాబాద్‌ (07596), నిజామాబాద్‌- కాచిగూడ(07593) రైళ్లను రద్దు చేశారు.  


భద్రాచలంరోడ్‌- బల్లార్షా (17033), బలార్షా-కాజీపేట(17036), కరీంనగర్‌- సిర్పూర్‌ టౌన్‌(07765), నిజామాబాద్‌- కరీంనగర్‌ (07894) రైళ్లు రద్దయ్యాయి. ఈ రైళ్లు వారం రోజుల పాటు  రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.  వీటితో పాటు హైదరాబాద్‌లో 22 ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా 14 నుంచి 20వ వరకు రద్దు చేశారు.


12 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల డిమాండ్‌ నేపథ్యంలో వచ్చే వారం వేర్వేరు ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఆగస్టు 13, 14 తేదీల్లో తిరుపతి - కాకినాడ టౌన్‌ (07063), నర్సాపూర్‌- తిరుపతి (07061), 14, 15 తేదీల్లో కాకినాడ టౌన్‌- తిరుపతి (07064), తిరుపతి- నర్సాపూర్‌ (07062), కాచిగూడ- విల్లుపురం (07424), 15న విల్లుపురం- కాచిగూడ (07425), 16న కాచిగూడ- కాకినాడ టౌన్‌ (07039), 17న కాకినాడటౌన్‌- కాచిగూడ (17040) రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.