Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rain) కురుస్తోంది. దీంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్ ల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సైదాబాద్, సంతోష్ నగర్ చంపా పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మలక్ పేటలలో భారీ వర్షం పడింది.  










వాహనదారులకు అవస్థలు


గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నగరవాసులను వరుణుడు కరుణించాడు. శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలకు ఉపశమనం లభించింది. హైదరాబాద్(Hyderabad) వాతావరణం చల్లబడింది. నగర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు, ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. నగరంలోని చంపాపేట్, సైదాబాద్, అంబర్‌పేట, ఓయూ క్యాంపస్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, దుండిగల్‌, సూరారం,  బహదూర్‌పల్లి, దూలపల్లిలో భారీ వర్షం కురిసింది. మలక్‌పేట, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, ఘట్‌కేసర్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 






Also Read : Jubileehills Accident : జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్, కారులో ఎమ్మెల్యే కుమారుడు