ప్రపంచవ్యాప్తంగా 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మొదటిసారి 4జీ స్మార్ట్ ఫోన్లను దాటాయి. ఈ సంవత్సరం జనవరిలో ప్రపంచంలో 4జీ స్మార్ట్ ఫోన్ల కంటే 5జీ స్మార్ట్ ఫోన్లే ఎక్కువ అమ్ముడయ్యాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ తెలిపింది. చైనాలో అమ్ముడుపోయిన ఫోన్లలో ఏకంగా 86 శాతం 5జీ ఫోన్లే ఉండటం విశేషం.
ఉత్తర అమెరికా, పశ్చిమ యూరోప్‌లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పశ్చిమ యూరోప్‌లో 76 శాతం, ఉత్తర అమెరికాలో 73 శాతం 5జీ ఫోన్లు ఉండటం విశేషం. చైనీస్ టెలికాం ఆపరేటర్లు 5జీ టెక్నాలజీని డెవలప్ చేయడం, చైనా బ్రాండ్లు 5జీ స్మార్ట్ ఫోన్లను తక్కువగా అందుబాటులోకి తీసుకురావడంతో చైనాలో ఈ స్థాయిలో 5జీ ఫోన్లు అమ్ముడయ్యాయి.
ఐఫోన్ 12 సిరీస్‌తో యాపిల్ కూడా 5జీ ఫోన్లను తయారు చేయడం ప్రారంభించింది. దీంతో ఉత్తర అమెరికా, పశ్చిమ యూరోప్‌ల్లో కూడా 5జీ ఫోన్ల సేల్ పెరిగాయి. కౌంటర్ పాయింట్ కథనం ప్రకారం... 2022 జనవరిలో మొత్తం అమ్ముడుపోయిన స్మార్ట్ ఫోన్లలో 51 శాతం 5జీ ఫోన్లే. 5జీ స్మార్ట్ ఫోన్లు 4జీ మొబైల్స్ అమ్మకాలను దాటడం ఇదే మొదటిసారి.
చైనా, పశ్చిమ యూరోప్, ఉత్తర అమెరికాల్లో 5జీ ఫోన్లు ఎక్కువగా అమ్ముడయ్యాయని, దాని కారణంగానే 5జీ ఫోన్లు డామినేట్ చేశాయని కౌంటర్ పాయింట్ తన నివేదికలో పేర్కొంది. క్వాల్‌కాం, మీడియాటెక్ సంస్థలో చవకైన, వేగవంతమైన 5జీ ప్రాసెసర్లను రూపొందించడం వల్లనే ఇది సాధ్యం అయిందని తెలిపింది.
ఆండ్రాయిడ్ 5జీ ఫోన్లు మొదట్లో 250 డాలర్ల నుంచి 400 డాలర్ల రేంజ్‌లో (సుమారు రూ.18,900 నుంచి రూ.30,000) లాంచ్ అయ్యేవి. ఇప్పుడు అది 150 డాలర్ల నుంచి 250 డాలర్లకు (సుమారు రూ.11,300 నుంచి రూ.18,900) వరకు తగ్గింది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?